చిరంజీవి మేనల్లుడుతో సైలెంట్ గా వైవియస్ చౌదరి?

By Srikanya

చిరంజీవి మేనల్లుడు(చెల్లెలు కుమారుడు)విశ్వతేజ తో అప్పట్లో దర్శకుడు విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేసారు. అయితే అది స్క్రిప్టు దశలోనే ఆగిపోయింది. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని వైవియస్ చౌదరి దర్శకత్వంలో సైలెంట్ గా ఓ చిత్రం చేస్తున్నట్లు సమాచారం. సలీం డిజాస్టర్ తో బొక్కబోర్లా పడ్డ వైవియస్...కొత్త హీరోలను పరిచయం చేయటంలో నైపుణ్యత ఉందని ఈ అవకాశం ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇంతకుముందు వైవియస్...రామ్ ని పరిచయం చేస్తూ దేవదాస్, వెంకట్ ని హీరోగా పరిచయం చేస్తూ సీతారాముల కళ్యాణం చూతుము రారండి చిత్రాలు రూపొందించారు. ఆ రెండు విజయం సాధించాయి.ఇప్పుడు అదే సెంటిమెంట్ ఈ చిత్రానికి వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక వైవియస్ చౌదరి కూడా నిర్మాతగా ఈ చిత్రంలో పాలు పంచుకునేలా ఎగ్రిమెంట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంభందించి కేవలం మాటలే జరిగాయని, ఇంకా పూర్తి స్ధాయి కన్ఫర్మేషన్ లేదని వినపడుతోంది.

ఇక ఇంతకు ముందు విశ్వతేజ హీరోగా, మధుశాలిని, రమ్య హీరోయిన్లుగా హ్యాపీజర్నీ పేరుతో ఓ చిత్రం ప్రారంభమైంది. పందెం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సభాపతి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వెంకటరమణారెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్ర కథ ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో సుఖసంతోషాలను అనుభవంచాలని జీవితంలో పూర్తిగా మునిగిపోయి మానవసంభంధాలను విస్మరిస్తారని...దాన్ని వెలికి చెప్పటమే తమ లక్ష్యమంటున్నారు అప్పట్లో దర్శక, నిర్మాతలు తెగ ఊదరకొట్టారు. అయితే ఈ చిత్రం సెంటిమెంటు ఏమైందో ఆ తర్వాత ఎవరికీ తెలియలేదు. ఇక చిరంజీవి మరో మేనల్లుడు అల్లు అర్జున్ తెలుగునాట కంటిన్యూగా తన హవా కొనసాగిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X