ఆ హీరోల్లో యుగపురుషుడు ఎవరు..?జూ ఎన్టీఆరేనా...!?
దివంగత నందమూరి తారకరామారావుకు వీరాభిమానిగా చలనచిత్రరంగంలోకి వచ్చి దర్శకుడిగా ఎదిగిన వైవిఎస్ చౌదరి గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆయన వంశీయులతో సినిమాలు చేయడమంటే చౌదరికి చెప్పలేనంత ఇష్టం. లేటెస్ట్ గా రవితేజతో 'నిప్పు', చిరంజీవి మేనల్లుడుతో 'రేయ్' వంటి సినిమాలను నిర్మిస్తున్నాడు. రేయ్" చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఫిలిం చాంబర్ లో 'యుగపురుషుడు" అనే టైటిల్ ని రిజిస్టర్ చేసాడని తెలుస్తోంది. మహానటుడు ఎన్టీఆర్ నటించిన చిత్రం 'యుగపురుషుడు". ఇప్పుడు మళ్ళీ ఇదే టైటిల్ ని వైవియస్ రిజిస్టర్ చేసాడంటే..నందమూరి హీరోలతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. నందమూరి హీరోల్లో ఎవరు ఈ సినిమాలో హీరోగా నటిస్తారు..? అని ఆలోచనలో పడ్డారు ఇండస్ట్రీలోని వర్గాలు. అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇప్పుడే టీనేజ్‌లో ప్రవేశించాడు. అతన్ని పరిచయం చేస్తాడా? బాలయ్యతో తీస్తాడా? అన్నది చర్చనీయాంశమైంది. అదేది కాదు జూ ఎన్టీఆర్ ని మనసులో పెట్టుకునే వైవియస్ ఈ టైటిల్ ని రిజిస్టర్ చేసి ఉంటాడనే హాట్ గా చర్చలు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











