Salaar: జాంబీలతో ప్రభాస్ ఊరమాస్ ఫైట్.. సలార్ నుంచి మరో సెన్సేషనల్ లీక్

తెలుగు చిత్ర పరిశ్రమకు స్టామినాను చూపించుకుని.. కొంత కాలంగా పాన్ ఇండియాపై దండయాత్ర చేసే విధంగా దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ జోష్‌లోనే సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు ఈ పాన్ ఇండియా స్టార్ హీరో 'సలార్' అనే సినిమాతో రాబోతున్నాడు.

కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచం మొత్తం ప్రభావాన్ని చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ చేసిన సినిమానే 'సలార్'. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ, మధ్యలో అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో ఇది ఎంతో ఆలస్యంగానే పూర్తి అయింది.

Zombie Fight Sequence Highlight In Prabhas Starrer Salaar Movie

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సలార్' మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా మొదలు పెట్టారు. ఇందులో మంచి ఔట్‌పుట్ ఇవ్వడం కోసం సినిమాను ఒకసారి వాయిదా కూడా వేసేశారు. ఇక, ఇప్పుడు ఈ మూవీలోని ఫస్ట్ పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' పేరిట డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా సందడి బాగా కనిపిస్తోంది.

Zombie Fight Sequence Highlight In Prabhas Starrer Salaar Movie

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సలార్' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో దీని నుంచి ఎవరూ ఊహించని ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ హై రేంజ్ సినిమా నుంచి ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ మూవీలో జాంబీల ఫైట్ సీక్వెన్స్ కూడా ఉందని తెలిసింది.

'సలార్' మూవీకి పని చేసిన ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన ఇందులో మాట్లాడుతూ.. 'సలార్‌లో జాంబీల ఫైట్ సీన్ ఒకటి ఉంది. వాళ్లు కుప్పలు కుప్పలుగా వందల మంది వస్తూనే ఉంటారు' అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఆ ఫైట్‌కు తాను చెప్పిన డబ్బింగ్ ఎలా ఉంటుందో కూడా వివరించారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X