ఓటీటీపై జాంబీరెడ్డి, గాలి సంపత్.. ఆహా ప్లాన్ అదుర్స్!
ఆహా స్ట్రీమింగ్ యాప్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. లాక్డౌన్ సమయంలో ఆహా యాప్‌కు సబ్‌స్క్రైబర్స్ వెల్లువెత్తారు. కొత్త కంటెంట్, చిన్న సినిమాలు, భిన్న కాన్సెప్ట్‌లతో వచ్చిన చిత్రాలను ఆహాలోకి తీసుకొచ్చారు. సినిమాలే కాకుండా కొత్త కొత్త షోలను కూడా తీసుకొచ్చారు. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు ఆహా అన్ని రకాల పాత్రలను చేస్తోంది. ప్రస్తుతం ఆహాలో కొత్త సినిమాల సందడి షురూ అయింది.
ఇప్పటికే క్రాక్ సినిమా ఆహాలో దుమ్ములేపుతోంది. హయ్యస్ట్ వ్యూస్ సాధించిన చిత్రంగా క్రాక్ దూసుకుపోతోంది. ఇక నాంది సినిమా కూడా తాజాగా ఆహాలోకి వచ్చేసింది. ఆహాలోనూ నాంది మంచి హిట్ అయింది. అయితే ఇప్పుడు మరో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఆహాలోకి రాబోతోన్నాయి. ఈ మేరకు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరిలో వచ్చిన జాంబిరెడ్డి ఓటీటీలోకి వచ్చేందుకు ముహూర్తం కుదిరింది.

జాంబీ రెడ్డి, గాలి సంపత్ సినిమాలు ఆహా వారు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రాబోతోన్నట్టు టాక్ వస్తోంది. ఈ రోజు లేదా రేపు ఈ మూవీ రిలీజ్ డేట్స్‌కు సంబంధించిన అప్డేట్ రాబోతోన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈరెండు సినిమాలకు కూడా మంచి రేటు ఇచ్చి డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











