Game Changer Music Review: 1000 మంది డ్యాన్లర్లతో రామ్ చరణ్..గేమ్ చేంజర్ రా మచా సాగ్ రివ్యూ
Game Changer: గోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీస్ ల్లో గేమ్‌ఛేంజర్ (Game changer)ఒకటి. ఈ మూవీ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ మూవీ నుంచి అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్, సినీ లవర్స్ చిత్రం యూనిట్ మరో క్రేజీ అప్‌డేట్‌ను అందించింది. ఇండియన్ సినీ హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనేలా ఓ మాస్ సాంగ్ ను షూట్ చేసినట్టు మూవీ టీం తెలిపింది.
గ్లోబల్ స్టార్ రాంచరణ్, అందాల భామ కియారా అద్వానీ జంటగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా ప్రతి అప్డేట్ కు కేజ్రీ రెస్పాన్ వచ్చింది. పాటలు, కంటెంట్‌కు భారీ స్పందన వస్తున్నది. ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'రా మచ్చా మచ్చా' (Raa Macha Macha) అనే పాట ప్రోమోను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

రా మచా మచా అనే పాటకు యంగ్ రైటర్ అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ నుంచి సంగీత సారథ్యం వహించారు. ఈ పాటకు థమన్ సంగీతం అందించగా.. రాంచరణ్, కియారా అద్వానీపై చిత్రీకరించారు.ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలోని మ్యూజిక్‌కు సంబంధించి ది సౌండ్స్ ఆఫ్ 'గేమ్ ఛేంజర్' పేరిట ఓ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ క్రేజీ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో డైరెక్టర్ శంకర్‌తో థమన్ 'గేమ్ ఛేంజర్' ఎంట్రీ సాంగ్ గురించి మాట్లాడటం చూడవచ్చు. ఈ చిట్ చాట్ లో 'రా మచ్చా మచ్చా'సాంగ్ స్టూటింగ్ కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనేలా సాంగ్ చేసే మరోసారి తన మార్క్‌ను చూపించారట స్టార్ డైరెక్టర్ శంకర్.
ముందుగా డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ '' గేమ్ చేంజర్ మూవీ కోసం గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఈ మూవీలో హీరో రామ్ చరణ్ ఏంట్రీ సాంగ్ చాలా డిఫరెంట్‌గా షూట్ చేయాలని భావించామన్నారు. దేశంలోని భిన్న సంస్కృతులను ఆధారంగా చేసుకోని ఓ పాటను రూపొందించాలని, ఇందుకోసం చాలా రీసెర్చ్ చేశామన్నారు. తెలంగాణలోని గుసాడి, కొమ్ము కోయ, ఏపీలోని తప్పెట గుళ్లు వంటి జానపద నృత్యాలను పాటలో భాగం చేయాలనుకున్నామన్నారు.

ఈ క్రమంలోనే వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రానప్ప, పైకా, దురువ వంటి వాటితో పాటు కర్ణాటకు చెందిన హలారి. ఒక్కలిగ, గొరవర, కుణిత వంటి జానపద కళాకారులను, నృత్య రీతులను భాగం చేయాలని భావించామని చెప్పారు. సాంగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చిందనీ, సౌండింగ్ కూడా ఇది వరకు ఎన్నడూ విననంత కొత్తగా ఉందని అన్నారు. ఈ ఎంట్రీ సాంగ్ లో ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి డాన్స్ చేశారని చెప్పకొచ్చారు. ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారనీ, చరణ్ అయితే ఓ బీజీఎంను సింగిల్ షాట్‌లో పూర్తి చేశారని డైరక్టర్ తెలిపారు.
ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. గేమ్ చేంజర్‌లోని 'రా మచ్చా మచ్చా' ఎంట్రీ సాంగ్‌లో దేశంలోని అన్ని రకాల జానపద కళారూపాలను చూపించామన్నారు. శంకర్ చాలా హుక్ లైన్స్ పరిశీలించి చివరకు 'రా మచ్చా మచ్చా' అనే లైన్‌ను సెలక్ట్ చేసుకున్నారనీ, పాటను స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు చాలా థ్రిల్ గా ఎంజాయ్ చేస్తారనీ అన్నారు. ఈ సాంగ్ సెప్టెంబర్ 30న పాట రిలీజ్ కానుందని వెల్లడించారు తమన్.


Click it and Unblock the Notifications











