150 కోట్ల రెమ్యునరేషన్ తో 'పుష్ప' రాజ్ సెన్సేషన్.. అల్లు అర్జున్ చార్జెస్ లెక్కలివేనట
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ మాధ్యమం కానీ అతి పెద్ద బిజినెస్ పరిశ్రమ కానీ ఏదన్నా ఉంది అంటే అది సినీ పరిశ్రమే అని చెప్పొచ్చు. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అలాగే అందుకు తగ్గట్టుగా భారీ బిజినెస్ లు సినిమాలకి జరుగుతూ ఉంటాయి. అంతే కాకుండా ప్రభుత్వాలకి కూడా సినిమాల పరంగా భారీ మొత్తంలో ధన సహకారం అందుతుంది.
దీనితో ఇప్పుడు సినిమాలకి ఉన్న డిమాండ్ తో హీరోలు కూడా రెమ్యునరేషన్ లు పెంచుకుంటూ వెళుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నిర్మాతలు పలువురు హీరోలు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు కానీ అదే సమయంలో కంటెంట్ కి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనితో చాలామంది స్టార్స్ కి ఈజీగా 100 కోట్లు అయినా లేదా రోజుకి ఇంత అని పెట్టుకున్నా అంత మొత్తం ఇస్తున్నారు.

ఇలా టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర చాలా మంది స్టార్స్ భారీ రెమ్యునరేషన్ లు తీసుకుంటున్నారు. అయితే మన తెలుగులో హైయెస్ట్ పైడ్ హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. మరి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పై ఓ క్లారిటీ ఇప్పుడు వచ్చింది. అల్లు అర్జున్ కి సన్నిహితుడు బన్నీ వాసు చెప్పిన దాని ప్రకారం బన్నీ ఏకంగా 150 కోట్లు రెమ్యునరేషన్ ని పుష్ప 2 కి తీసుకుంటున్నట్టుగా రివీల్ చేశారు. దీనిపై చిన్న లెక్క కూడా తాను చెప్పారు.
ఇప్పుడు సినిమాల బిజినెస్ బట్టి హీరోలకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఉంటుంది అని పుష్ప 2 సుమారు 1000 కోట్ల మార్కెట్ ఉందని అందులో 20 పర్సెంట్ మేర అల్లు అర్జున్ తీసుకోవడంలో తప్పేమి ఉంది అని తెలిపారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 కోసం మొత్తం మూడేళ్లు కేటాయించారు.

ఒక హీరో కేవలం మూడేళ్లు ఒకే సినిమాకి కేటాయించడం అనేది చిన్న విషయం కాదు సో అలా కూడా అల్లు అర్జున్ చార్జెస్ ఉంటాయని. ఒకవేళ అల్లు అర్జున్ 150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నా అందులో టాక్సుల రూపం లోనే 50 కోట్లు చెల్లిస్తారని సో తనకి మిగిలేది టెక్నీకల్ గా 100 కోట్లు మాత్రమే అని బన్నీ వాసు తెలిపారు. దీనితో అల్లు అర్జున్ పుష్ప 2 కోసం మాత్రం రికార్డు రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారని చెప్పాలి.
ఇక ఈ సినిమా గాని హిట్ అయితే నెక్స్ట్ సినిమా నుంచి అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే హైయెస్ట్ పైడ్ హీరోగా నిలిచినా ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి. ఇంకా ఈ సంచలన సీక్వెల్ ని దర్శకుడు సుకుమార్ మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఈసారి పుష్ప రూల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది అని తెలుస్తుంది. అలాగే రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈసారి ఐటెం భామగా బాలీవుడ్ హాట్ బాంబ్స్ జాన్వీ కపూర్ లేదా త్రిప్తి దిమ్రి లు కనిపించనున్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. ఇంకా వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











