saripodhaa sanivaaram : యూఎస్ బాక్సాఫీస్ వద్ద నాని అరాచకం.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కొత్త రికార్డులు
క్లాస్ మాస్ తేడా లేకుండా అన్ని రకాల చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నారు నేచురల్ స్టార్ నాని. గతేడాది దసరాతో భారీ హిట్‌ను అందుకున్న ఆయన.. ఆ వెంటనే వచ్చిన హాయ్ నాన్నతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సక్సెస్ జోష్‌ను ఇలాగే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంలో ఉన్న నేచురల్ స్టార్ మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే సరిపోదా శనివారం. టైటిల్‌తోనే ఆయన ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఈ మూవీలో నటించారు. ఇందులో తమిళ దర్శకుడు , నటుడు ఎస్‌జే సూర్య విలన్ రోల్ పోషిస్తున్నారు. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ గ్యాంగ్ లీడర్‌లో జోడీగా కనిపించిన సంగతి తెలిసిందే. మళ్లీ చానాళ్లకు ఈ జంట ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. అలాగే వివేక్ ఆత్రేయతోనూ నాని గతంలో వర్క్ చేశారు. వివేక్ దర్శకత్వంలో అంటే సుందరానికి మూవీలో నాని నటించారు.

సరిపోదా శనివారం మూవీని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ , మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నారు. గత శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. అలాగే చిత్ర యూనిట్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తోంది.
ఎస్‌జే సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని ఎంజాయ్ చేశానని , పర్ఫార్మెన్స్ పరంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని నాని తెలిపారు. సరిపోదా శనివారంలో ఆ రోల్‌కి సూర్యని తప్పించి మరొకరిని ఊహించుకోలేమన్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.. అంటే రూ.42 వేల కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్న మాట. మరి నాని ఈ టార్గెట్‌ను ఎలా కొడతాడా అనేది ట్రేడ్ వర్గాలను సైతం అటెన్షన్‌లో ఉంచింది.
అయితే అడ్వాన్స్ బుకింగ్‌లో సరిపోదా శనివారం కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. అమెరికాలో ప్రీమియర్స్ కోసం ఇప్పటికే 17 వేల టికెట్లు బుక్ అయినట్లుగా టాక్. తొలిరోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లు ఓపెనింగ్స్‌ని రాబట్టవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సరిపోదా శనివారంకు ఏపీ తెలంగాణలలో 15 వేల షోలు పడుతుండగా.. ఒక్క అమెరికాలోనే 12 వేలకు పైగా షోస్ వేయనున్నారు. దీంతో నాని అభిమానులు బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో షోలను , స్క్రీన్లను పెంచాలని నిర్మాతల డీవీవీ దానయ్యను కోరుతున్నారు. అలాగే ఐనాక్స్, పీవీఆర్ మధ్య ఇష్యూని ఫిక్స్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











