రానా దగ్గుబాటికి జపాన్ అభిమానుల నుంచి భారీగా కానుకలు, 19 బాక్సుల్లో...

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'బాహుబలి' ప్రాజెక్ట్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు... జపాన్ లాంటి దేశాల్లో కూడా ఈ చిత్రానికి ఊహించని ఆదరణ లభించింది. దర్శకుడు రాజమౌళితో పాటు ప్రభాస్, రానాకు అక్కడ భారీగా అభిమానులు ఏర్పడ్డారు.

నేడు రానా పుట్టినరోజు సందర్భంగా జపాన్ అభిమానుల నుంచి ఊహించని కానుక అందింది. ఒకటి కాదు, రెండు కాదు.... 19 బాక్సుల్లో రానాను విష్ చేస్తూ ఉత్తరాలు, గిఫ్టులు జపాన్ నుంచి ఆర్కా మీడియా ఆఫీసుకు వచ్చాయి.

అన్నీ కలెక్ట్ చేసి పంపిన జపాన్ డిస్ట్రిబ్యూటర్

అన్నీ కలెక్ట్ చేసి పంపిన జపాన్ డిస్ట్రిబ్యూటర్

రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్తరాలు, బహుమతులు జపాన్‌లోని... బాహుబలి చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన ఆఫీసుకు రావడంతో, వాటిని 19 బాక్సుల్లో సర్దేసి హైదరాబాద్‌లోని ఆర్కా మీడియా ఆఫీసుకు పంపారు.

ఆశ్చర్యపోయిన నిర్మాతలు

ఆశ్చర్యపోయిన నిర్మాతలు

రానాకు ఇంత భారీ మొత్తంలో జపాన్ నుంచి బహుమతులు రావడంతో..... బాహుబలి నిర్మాతలు సైతం ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. భల్లాలదేవుడి నటనను జపనీయులు ఎంతలా ఇష్టపడ్డారో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ.

బాహుబలిలో రానా నట విశ్వరూపం...

బాహుబలిలో రానా నట విశ్వరూపం...

‘బాహుబలి' సినిమా ముందు వరకు రానాలో ఆ స్థాయి యాక్టింగ్ టాలెంట్ ఉందని చాలా మంది గుర్తించలేదనేది వాస్తవం. అతడిలోని నట విశ్వరూపాన్ని రాజమౌళి.... భళ్లాలదేవుడి పాత్ర ద్వారా వెలికి తీశాడు. దాదాపు మూడేళ్లు ఈ సినిమాకు పని చేసిన రానా పెర్ఫార్మెన్స్ పరంగా బాగా రాటుదేలాడని చెప్పొచ్చు.

రానా 34వ పుట్టినరోజు

రానా 34వ పుట్టినరోజు

డిసెంబర్ 14, 1984లో జన్మించిన రానా.... నేటితో 34వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. రానా ప్రస్తుతం ‘హాథీ మేరీ సాతీ' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు ఎన్టీఆర్ బయోపిక్, బాలీవుడ్ మూవీ హౌస్‌ఫుల్ 4లో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X