దిగిపోద్ది.... హీరో నాని నిజం స్వరూపం ఇదే, ట్విట్టర్ పోస్ట్ వైరల్!
Recommended Video

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు మంచి పొజిషన్లో కొనసాగుతున్నాడు హీరో నాని. అయితే ఈ నేచురల్ స్టార్ ఒకప్పుడు సాధారణ ప్రేక్షకుడిలా క్యూ లైన్లో నిల్చుని చొక్కాలు చించుకుని మరీ సినిమాలు చూసిన వ్యక్తే.
తనకు నచ్చిన సినిమా చూస్తే సగటు ప్రేక్షకుడిలా ఎగ్జైట్ అవ్వడంతో పాటు తనలోని ఆ సంతోషాన్ని, నచ్చకపోతే ఆ కోపాన్ని సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాలని నానికి కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం అతడు సెలబ్రిటీ కాబట్టి అలాంటివి చేయలేని పరిస్థితి. కానీ 2.0 సినిమా చూసిన తర్వాత తన సెలబ్రిటీ స్టేటస్ పక్కన పెట్టి తనలోని అసలైన సినీ అభిమాని నిజస్వరూపం చూపడంతో పాటు ఆనందంతో బరస్ట్ అయిపోయాడు నాని.

బాక్సాఫీసుకు దిగిపోద్ది అంటూ...
2.0 చిత్రాన్ని గురువారం రాత్రి సెకండ్ షో చూసిన అనంతరం నాని ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ అదరగొట్టారంటూ ట్వీట్ చేశాడు. ‘‘బాక్సాఫీసుకు దిగిపోద్ది'' అంటూ తనలోని అసలు సిసలైన అభిమానాన్నిబయటపెట్టాడు.

చిన్న పిల్లాడిలా
చాలా కాలం తర్వాత చిన్న పిల్లాడిలా మారిపోయాను. దిస్ ఈజ్ శంకర్ ఎఫెక్ట్ అంటూ..... నాని తన మనసులోని విషయాన్ని బయట పెట్టారు.
ఈ పోస్ట్ చూసి అంతా షాక్
దీంతో పాటు నాని తన పోస్టులో ఒక జిఫ్ ఇమేజ్‌ను కూడా జత చేయడం గమనార్హం. 300 చిత్రంలో హీరో విలన్లను ఒక్క ఉదుటన తన్నేసిన సీన్ అది. శంకర్ కూడా ఇప్పటి వరకు బాక్సాఫీసు వద్ద ఉన్న రికార్డులను అలా తన్నేస్తున్నాడని నాని చెప్పకనే చెబుతున్నాడు.
ఫస్ట్ షో మిస్సయ్యాననే బాధ
గురువారం షూటింగ్ ఉండటంతో నాని ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్సవుతున్నాను అనే బాధ వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని ‘జెర్సీ' మూవీ షూటింగులో బిజీగా గడుపుతున్నాడు.


Click it and Unblock the Notifications











