twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపాడేది అతడేనా? అందరి దృష్టి జూ ఎన్టీఆర్ వైపే.. బ్రహ్మజీ సంచలన ట్వీట్

    |

    ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో అధికార తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. 175 సీట్లు ఉన్న అసెంబ్లీలో కనీసం పావువంతు సీట్లు కూడా సాధించలేక పోయింది. ప్రజల్లో ఈ పార్టీ నమ్మకం పూర్తిగా కోల్పోయింది అనడానికి తాజా ఫలితాలే నిదర్శనం.

    టీడీపీ ఓటమికి కారణాలు ఏమిటి? అంటే... ' అబద్దాలు చెప్పడం, వెన్నుపోటు పొడవటం, అవినీతి, అసమర్ధత, వైఎస్ జగన్, నారా లోకేష్' అని రాంగోపాల్ వర్మ లాంటి చెబుతున్న మాట. మరి ఈ పరిస్థితుల్లో ఆ పార్టీని కాపాడేది ఎవరు? అనే విషయమై తెలుగు ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

    తెలుగు దేశాన్ని కాపాడేందుకు జూ ఎన్టీఆర్ వస్తున్నాడా? బ్రహ్మజీ సంచలన ట్వీట్

    ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల ఫలితాలు గమనిస్తున్న ప్రముఖ నటుడు, జూ ఎన్టీఆర్ సన్నిహితుడైన బ్రహ్మాజీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఇక మా తారక రాముడే ఆదుకోవాలి' అంటూ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ తెలుగు దేశం పార్టీ ఓటమిని ఉద్దేశించే అని అంటున్నారు. త్వరలోనే జూ ఎన్టీఆర్ రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీని ఆదుకుంటాడని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు.

    ఇపుడు అందరి చూపు జూ ఎన్టీఆర్ వైపే

    ఇపుడు అందరి చూపు జూ ఎన్టీఆర్ వైపే

    తెలుగు దేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు వారసుల్లో రాజకీయాలకు సమర్థుడైన వ్యక్తిగా జూ ఎన్టీఆర్ ఇప్పటికే కీర్తి గడించారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసి తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. అయితే ఎన్టీఆర్ టాలెంట్ చూసి భయపడ్డ చంద్రబాబు... తన కుమారుడు లోకేష్‌‌ను‌ పైకి తేవడంలో భాగంగా జూనియర్‌ను తొక్కేశారనే వాదన ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ పార్టీని కాపాడే సత్తా కేవలం జూ ఎన్టీఆర్‌కు మాత్రమే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    జగన్‌కు కాంగ్రాట్స్ చెప్పిన బ్రహ్మాజీ

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్న వైఎస్ జనన్మోహన్ రెడ్డికి కాంగ్రాట్స్ చెబుతూ బ్రహ్మాజీ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ' 175 సీట్లుగాను 150 సీట్లలో విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ ఎన్నికల చరిత్రలో ఇదొక సంచలన రికార్డ్.

    మోదీకి శుభాకాంక్షలు

    కేంద్రలో మరోసారి అధికారం చేపట్టబోతున్న నరేంద్రమోదీకి సైతం బ్రహ్మాజీ శుభాకాంక్షలు తెలిపారు. 2019 ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్టీఏ 350పైగా సీట్లలో అధిక్యం కొనసాగిస్తూ దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.

    English summary
    Occasion of 2019 Election results, Acror Brahmaji interesting tweet on Jr NTR, Jagan, Modi. Brahmaji is an Indian film actor best known for his work in the Telugu cinema industry. He appears mostly in Telugu movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X