twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయంలో చిరంజీవి, బాలయ్య, నాగ్ విఫలం.. వెంకటేష్‌కు మాత్రం తిరుగులేదు.!

    By Manoj
    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదటి తరం హీరోల తర్వాత అంతగా పాపులర్ అయిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వీళ్లు నలుగురు చాలా కాలం పాటు తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. చిరు, బాలయ్య క్లాస్, మాస్‌ను ఆకట్టుకోగా.. నాగ్, వెంకీ మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువ అయ్యారు. యంగ్ హీరోలు సత్తా చాటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ వీళ్లు తమ మార్కును చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిగ్ ఫోర్ గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇంతకీ ఏంటా చర్చ.? పూర్తి వివరాల్లోకి వెళితే...

    చిరంజీవికి భారీ ఎదురుదెబ్బ

    చిరంజీవికి భారీ ఎదురుదెబ్బ

    ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని సురేందర్ రెడ్డి రూపొందించాడు. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చి దారుణమైన పరాజయాన్ని చవి చూసింది.

    బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్

    బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్

    2019లో నందమూరి బాలకృష్ణ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. తన తండ్రి బయోపిక్‌గా వచ్చిన ‘యన్.టి.ఆర్.. కథానాయకుడు', ‘యన్.టి.ఆర్.. మహానాయకుడు'తో పాటు ఇటీవల ‘రూలర్' అనే సినిమా వచ్చింది. ఈ మూడు మూవీలు కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

    నాగార్జునుకూ తప్పని నిరాశ

    నాగార్జునుకూ తప్పని నిరాశ

    ఇక, ఇదే సంవత్సరం అక్కినేని నాగార్జున ఒకే ఒక్క సినిమాతో వచ్చాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అతడు నటించిన ‘మన్మథుడు 2' అనే సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇందులో బోల్డ్ డైలాగులు, సీన్స్ వల్ల విమర్శలు కూడా ఎదురయ్యాయి.

    వెంకటేష్ మాత్రం సక్సెస్

    వెంకటేష్ మాత్రం సక్సెస్

    బిగ్ ఫోర్‌లో వెంకటేష్ ఒక్కడే సక్సెస్ అయ్యాడు. ఆయన ఈ సంవత్సరం నటించిన రెండు సినిమాలు విడుదల అయ్యాయి. అవి రెండూ మల్టీస్టారర్ మూవీలే. అందులో ఒకటి ‘F2' కాగా, మరొకటి ‘వెంకీ మామ'. ఈ రెండు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు వెంకీ.

    English summary
    Venkatesh is arguably one of the most respected names in Telugu cinema today. The veteran star is loved by all and sundry due to his humble nature and sincere performances. Now, here is some big news for his fans. According to reports, the hero might soon be teaming up with 'Natural Star' Nani for a multi-starrer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X