టాలెంటెడ్ హీరోపై 2020 దెబ్బ.. ఆశలన్నీ ఆ సినిమాపైనే..

టాలీవుడ్ లో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు గోపీచంద్. సీనియర్ డైరెక్టర్ టి.కృష్ణ గారి అబ్బాయి అయినప్పటికీ సొంతంగా విలన్ పాత్రలు చేసి మొదట ఒక నటుడిగా తానేంటో నీరూపించుకున్నాడు. అయితే ఈ హీరో గత ఐదేళ్ల నుంచి సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. చివరగా జిల్ సినిమా తప్పితే మరేసినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.

ఆ మధ్య వచ్చిన గౌతమ్ నంద కాస్త హడావుడి చేసింది కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో అయితే కలెక్షన్స్ సాధించలేకపోయింది. ఆక్సిజన్, పంతం, చాణక్య అంటూ చాలా రకాల సినిమాలు చేశాడు గాని ఏది వర్కౌట్ కాలేదు. సరైన కథ తగలడం లేదు గాని సరిగ్గా సెట్టయిన కథ దొరికితే గోపిచంద్ మాస్ హీరోయిజం దెబ్బకు బాక్సాఫీస్ కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉంటాయి. అయితే ఈ ఏడాది రిలీజ్ చేయాలని అనుకున్న సీటిమార్ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు.

2020 year big effect on Gopichand no hits from last 5 years

2020లో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకున్న గోపిచంద్ మరో ఏడాది వరకు వెయిట్ చేయాల్సి వస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న సీటీ మార్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కబడ్డీ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతోంది. గోపీచంద్, తమన్నా ఇద్దరు కూడా కబడ్డీ జట్ల యొక్క కోచ్ లుగా నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా గోపిచంద్ సరైన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X