2021లో లాంచ్ అయిన హీరోలు.. ఫస్ట్ సినిమాతోనే బిగ్ సక్సెస్!

2021లో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మార్పులు కనిపించాయి. కరోనా దెబ్బకు గత ఏడాది చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా డౌన్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి ఒకవైపు కరోనా తీవ్రత పెరుగుతున్న కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కాస్త ధైర్యంగా ముందుకు సాగింది. అయితే ఈ తరుణంలో కొంతమంది హీరోలు కూడా సినిమా హీరోలుగా లాంచ్ అయ్యారు. ఇక 2021లో బెస్ట్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన టాప్ 5 హీరోల లిస్టుపై ఒక లుక్కేస్తే..

ఉప్పెన లాంటి ఎంట్రీ..

ఉప్పెన లాంటి ఎంట్రీ..

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే భారీ స్థాయిలో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. అతను చేసిన మొదటి సినిమా ఉప్పెన ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా 100 కోట్ల బిజినెస్ చేయడంతో అతని మార్కెట్ కూడా అమాంతంగా పెరిగి పోయింది. దాదాపు 50 కోట్ల వరకు షేర్ ను అందించిన ఆ సినిమా టాప్ లిస్టులో చేరిపోయింది. అంతేకాకుండా 2021లో బెస్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో వైష్ణవ్ మొదటి స్థానంలో నిలిచాడు.

 శ్రీకాంత్ తనయుడు

శ్రీకాంత్ తనయుడు

సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు హీరోగా లాంచ్ అయిన సినిమా పెళ్లి సందడి బాక్సాఫీస్ వద్ద అసలు సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. ఈ సినిమాకు కీరవాణి మంచి సంగీతం అందించి ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఒక మంచి బజ్ క్రియేట్ చేశారు. మొత్తానికి ఈ సినిమా పండుగ సమయంలో అయితే మంచి టాక్ తో కలెక్షన్స్ కూడా అందుకుంది. సీనియర్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాలో మొదటిసారి వెండి తెరపై కనిపించిన విషయం తెలిసిందే.

యాంకర్ ప్రదీప్..

యాంకర్ ప్రదీప్..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సాధారణ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ మాచిరాజు ఆ తర్వాత టెలివిజన్ రంగంలో బిజీగా మారిపోయాడు. యాంకర్ గా అతను ఎలాంటి షో చేసినా కూడా రేటింగ్స్ అందుకోవడంలో ముందుంటాడు.. ఫైనల్ గా తను హీరో అవ్వాలి అనుకున్న కలను కూడా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో నిజం చేసుకున్నాడు. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలు అయితే వచ్చాయి

జాంబీ రెడ్డితో తేజ సజ్జా..

జాంబీ రెడ్డితో తేజ సజ్జా..

ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఇంద్ర వంటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నా తేజ సజ్జ చాలా కాలం తర్వాత మళ్ళీ ఓ బేబీ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ అందులో అతను ఒక సైడ్ క్యారెక్టర్ పాత్ర చేసాడు. ఆ తరువాత హీరోగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతనికి జాంబీ రెడ్డి అనే సినిమా చేసే అవకాశం దక్కింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించడంతో అతను కూడా బెస్ట్ ఎంట్రీ ఇచ్చిన హీరోల లిస్టులో చేరిపోయాడు..

సత్య.. వివాహా బోజనంబు

సత్య.. వివాహా బోజనంబు

కమెడియన్ సత్య కూడా ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటుడిగా కొనసాగుతున్నాడు. అయితే అతను కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా కొనసాగితే చాలు అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా అతని టాలెంట్ కు తగ్గట్టుగా ఒక మంచి లీడ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. వివాహభోజనంబు అనే సినిమాలో హీరోగా నటించిన కమెడియన్ సత్య మంచి క్రేజ్ అందుకున్నాడు. ఈ సినిమాను హీరో సందీప్ కిషన్ తన సొంత బ్యానర్ లో నిర్మించాడు. మొత్తానికి ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X