2021 Twitter Top 10 హీరోస్.. నెంబర్ 2లో పవన్ కళ్యాణ్.. నెంబర్ వన్ ఎవరంటే?
సోషల్ మీడియా అనేది ఇటీవల కాలంలో సినిమా ప్రపంచానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంతే కాకుండా రాజకీయ అంశాలను సామాజిక అంశాలపై కూడా సోషల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే 2021 ట్విట్టర్ ప్రపంచంలో కూడా చాలా అంశాలపై నెటిజన్లు వారి స్పందనను తెలియజేశారు. ఇక స్టార్ హీరోల పై కూడా అభిమానాన్ని ప్రేమను ఎంతగానో చాటుకున్నారు. 2021 సౌత్ లో ట్విట్టర్ లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన స్టార్ హీరోల పేర్లు కూడా వచ్చేసాయి. సౌత్ ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు కోలీవుడ్ హీరోలతో గట్టిగానే పోటీ పడ్డారు.

ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా..
సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోయినప్పటికీ కూడా అజిత్ కుమార్ పేరు 2021 ట్విట్టర్ లో బాగానే హైలెట్ అయ్యాడు. ముఖ్యంగా వాలిమై సినిమాకేజ్ సంబంధించిన అప్డేట్స్ పై అభిమానులు ట్విట్టర్ వేదికగా అజిత్ పేరును ఎక్కువగా ట్వీట్ చేశారు. అంతే కాకుండా అజిత్ బైక్ ట్రావెలింగ్ కు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

ధనుష్ తరువాత రామ్ చరణ్
ఇక సౌత్ ఇండస్ట్రీలో 9వ స్థానంలో ధనుష్ పేరు ఎక్కువగా ట్వీట్ చేయబడింది. వరుసగా డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకున్న ధనుష్ పేరు పోస్టర్లు ట్విట్టర్ లో బాగానే వైరల్ అయ్యాయి. ఇక 8వ స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. ఎక్కువహా RRR సినిమా ద్వారా రామ్ చరణ్ పేరు ట్విట్టర్ లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.

తలైవా సూపర్ 7
7వ స్థానంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నిలిచారు. ఈ ఏడాది పెద్దన్న సినిమాతో కాస్త ఎక్కువగా హడావుడి చేసిన రజనీకాంత్ పాలిటిక్స్ కి సంబంధించిన అంశాలలో కూడా ఎక్కువగా నిలిచారు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఏదేమైనా కూడా తలైవా ప్రతి ఏడాది ట్విట్టర్ లో టాప్ 10 లిస్ట్ లో దర్శనమిస్తున్నారు.

పుష్ప వల్ల పెరిగిన బన్నీ స్థానం
ఇక 6వ స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. ట్విట్టర్ లో అల్లు అర్జున్ అంత బిజీగా ఏమి కనిపించకపోయినా కూడా ఎక్కువగా పుష్ప కారణంగా వైరల్ అయ్యాడు. సోషల్ మీడియాలో బన్నీకి ఫ్యాన్ ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. ఇక 5వ స్థానంలో అల్లు అర్జున్ ఎక్కువగా ట్వీట్ చేయబడిన సౌత్ సెలబ్రిటీగా నిలిచారు. తారక్ పేరు కూడా RRR కారణంగానే ఎక్కువగా వైరల్ అయ్యింది.

మహేష్, సూర్య..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారు. ఇక సౌత్ టాప్ ట్విట్టర్ సెలబ్రెటీలలో ఆయన 4వ స్థానంలో నిలిచారు. ఇటీవల సూర్య పేరు ఎక్కువగా జై భీమ్ వెబ్ ఫిల్మ్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక 3వ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. మహేష్ ఎక్కువగా సర్కారు వారి పాట సినిమాతోనే హాట్ టాపిక్ గా నిలిచాడు.

నెంబర్ 2లో పవర్ స్టార్
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ ట్విట్టర్ హీరోగా పవన్ కళ్యాణ్ నిలిచారు. ఇక సౌత్ లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన హీరోగా నెంబర్ 2లో నిలిచారు. ఒక విధంగా పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువగా పొలిటికల్ కు సంబంధించిన అంశాలతోనే హాట్ టాపిక్ గా నిలిచాడు.

నెంబర్ వన్ విజయ్
ఇక నెంబర్ వన్ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నిలిచారు. విజయ్ ఇటీవల కాలంలో భారీ ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తెలుగులో కూడా అతని రేంజ్ అంతకంతకు పెరుగుతోంది. ఇక మాస్టర్ సినిమాతో పాటు బీస్ట్ అప్డేట్స్ కారణంగా విజయ్ పేరు ట్విట్టర్ లో ఎక్కివగా ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











