2021 Sankranthi Movies: పొంగల్ భరిలో షాక్ ఇవ్వబోతున్న రాజశేఖర్.. అస్సలు తగ్గట్లేదుగా!

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ ఒకప్పుడు వరుసగా బాక్సాఫీస్ హిట్స్ తో తనకంటూ ఒక మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. రాజశేఖర్ సినిమా వస్తోంది అంటే ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ వద్ద క్యూ కట్టేవారు. అయితే మెల్లగా ఆయనకు వరుసగా ఫ్లాప్స్ రావడంతో మార్కెట్ కూడా ఒక్కసారిగా తగ్గిపోయింది. అయినప్పటికీ రాజశేఖర్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన సొంత ప్రొడక్షన్ లోనే కొన్ని సినిమాలు చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆయన సతీమణి సీనియర్ హీరోయిన్ జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో కూడా కొన్ని సినిమాలు చేశారు. కానీ రాజశేఖర్ కు గతంలో మాదిరిగా విజయాలు దక్కలేదు.

2017 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన గరుడ వేగా సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమాలో రాజశేఖర్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. అయితే ఆ తర్వాత రాజశేఖర్ చేసిన కల్కి సినిమా మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరు అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ మూవీ కూడా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. అయితే రాజశేఖర్ మళ్లీ ఎప్పటిలానే కొత్త తరహా కథలతో ప్రేక్షకులకు అందించాలని సిద్ధమయ్యాడు.

2021 Sankranthi Movies Rajasekhar also will join in big fight

ప్రస్తుతం డిఫరెంట్ గా ఉండే శేఖర్ అనే సినిమాతో సిద్ధమవుతున్నాడు. అయితే ఆ సినిమాను సంక్రాంతి పోటీలో కి తీసుకు వచ్చేందుకు రాజశేఖర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ఇటువంటి జోసెఫ్ అనే సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు లలిత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక MLV సత్యనారాయణతో కలిసి సంయుక్తంగా రాజశేఖర్ కూతురులు శివానీ శివాత్మిక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే సంక్రాంతి పోటీలో కి తీసుకు వచ్చేందుకు నిర్మాతలు ఇటీవల చర్చలు జరిపినట్లు సమాచారం.

కానీ ఇప్పటికే జనవరి 7న RRR సినిమా రాబోతోంది. 12 వ తేదీన పవన్ కళ్యాణ్ రానా భీమ్లా నాయక్ విడుదల కానుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట అన్న విషయం తెలిసిందే. ప్రభాస్ సినిమా జనవరి 14న విడుదలకానుంది. అలాగే నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా కూడా దసరా భరిలోనే దిగబోతోంది. కొత్త సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతి పోటీలు రసవత్తరంగా కనబడుతున్నాయి. అయితే ఇతర సినిమాల కలెక్షన్స్ పై కూడా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. అయితే ఇలాంటి కఠిన సమయంలో పోటీ కి వెళ్లడం రిస్కుతో కూడుకున్న పని అని చాలా సినిమాలు వాయిదా వేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను సంక్రాంతి భరిలో దింపాలని అనుకున్నాడు. కానీ పోటీ ఎక్కువ కావడంతో వెనుకడుగు వేయక తప్పలేదు. ఇక సీనియర్ స్టార్ రాజశేఖర్ మాత్రం శేఖర్ సినిమాను సంక్రాంతి ఫెస్టివల్ హడావిడిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. మరి ఆయన తీసుకునే నిర్ణయం సినిమాకు ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X