2023 పొంగల్ బరిలో మరో బిగ్ హీరో సినిమా.. ప్రభాస్, విజయ్ తో పాటు ఆ స్టార్ కూడా...
సౌత్ సినిమా ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ కనిపించబోతోంది. అగ్ర హీరోలు ఒకేసారి ఫెస్టివల్స్ ను టార్గెట్ చేస్తూ ఉండటంతో ఫ్యాన్స్ మధ్యలో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో అయితే ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోలు ఒక పండుగని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారుతొంది. 2023 సంక్రాంతి కోసం కొన్ని పెద్ద హీరోల సినిమాలు విడుదల కోసం సిద్ధం చేయాలి అనే నిర్మాతలు దర్శకులు ప్రణాళికలుగా రచిస్తున్నారు. ఇక అందులో ప్రభాస్ విజయ్ సినిమాతో పాటు ఇప్పుడు మరొక అగ్ర హీరో సినిమా కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు అజిత్ అని సమాచారం.
అందరికంటే ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. మొదటిసారి ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. కాబట్టి తప్పకుండా అన్ని భాషల్లో కూడా సినిమాపై మంచి అంచనాలు అయితే క్రియేట్ అవుతాయి. అలాగే విజయ్ మొదటిసారి ఒక ద్విభాషా చిత్రంలో నటుస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు నిర్మిస్తున్న వారసుడు సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ రెండు సినిమాలతో పాటు మరొక అగ్ర హీరో కూడా అదే సమయానికి వచ్చే అవకాశం ఉంది. అతను మరెవరో కాదు అజిత్ అని తెలుస్తోంది. అసలు విజయ్ ఫ్యాన్స్ అజిత్ ఫ్యాన్స్ మధ్యలో వార్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అజిత్ నటిస్తున్న తునివో అనే సినిమా సంక్రాంతికి రాబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాను బోనికపూర్ నిర్మిస్తుండగా హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఆ సంక్రాంతికి మరికొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు రావచ్చు అని తెలుస్తోంది. ఏదేమైనా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు అవుతాయని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











