Don't Miss!
- News
బీజేపి ఛీఫ్ కు ప్రమాద ఘంటికలు.!అధిష్టానం టచ్ లో ఆ ఉద్యమ నేత.!"సన్ స్ట్రోక్" ప్రభావమేనా.?
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
2023 సంక్రాంతి ఫైట్ లో చిన్న హీరో.. బడా సంస్థ సపోర్ట్ తో పోటీగా మరో సినిమా!
టాలీవుడ్ ఇండస్ట్రీలో 2023 సంక్రాంతి హాట్ టాపిక్ గా మారనుంది. చాలా కాలం తరువాత అగ్ర హీరోలు పోటీ పడే విధానం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందనేది కూడా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాల ఫలితాలు చాలా కీలకం కానున్నాయి. ఇప్పటికే ఇరువర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో బిగ్ ఫైట్ అయితే నడుస్తోంది. గత చరిత్రలోని పాత రికార్డుల గురించి మాట్లాడుకుంటున్న ఫ్యాన్స్ మరింత హీటేక్కిస్తున్నారు. ఇక బాక్సాఫీస్ నెంబర్స్ అనేవి కూడా చాలా కీలకం కానున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రానున్నట్లు చెప్పారు కానీ ఇంకా అఫీషియల్ డేట్ పై క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి మాత్రం జనవరి 12న రానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ఒక రోజు ముందు లేదా ఆ తరువాత క్లాష్ లేకుండా వాల్తేరు వీరయ్య వచ్చే అవకాశం ఉంది. ఇక జనవరి 12న విజయ్ వారసుడు రానున్నట్లు తెలుస్తోంది. ల్ ఈ మూడు సినిమాలతో పాటు అజిత్ తునివు కూడా తెలుగులో అదే మూమెంట్ లో విడుదల కానుంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 4 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

ఈ బిగ్ స్టార్స్ మధ్యలో రిస్క్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితిలో ఒక యువ హీరో సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న 'కళ్యాణం కమనియం' అనే సినిమాను కూడా సంక్రాంతి ఫెస్టివల్ లో విడుదల చేసేందుకు బడా సంస్థ యువి రెడీ అయ్యింది. యువీ క్రియేషన్స్ వారు ఈ యువ హీరో సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదట లిమిటెడ్ థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారట. ప్రస్తుతం ప్లాన్ ప్రకారం పెద్ద సినిమాలన్నీ వచ్చిన తరువాత 2023 జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారట. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది.