Top 10 Heros: మెగా హీరోలను వెనక్కినెట్టిన ముగ్గురు మొనగాళ్లు.. టాప్ 10లో ఎవరున్నారో తెలుసా?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ రంగాలు, సినిమాలు, సినీ తారలు, వెబ్ సిరీస్ లు ఇలా అన్నింటిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ సరైన ఫలితాలు వెల్లడిస్తుంటుందీ సంస్థ. తాజాగా ఏప్రిల్ 2024కి సంబంధించి తెలుగు టాప్ హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 హీరోల పేర్లను ఎక్స్ వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా ఈసారి మెగా హీరోలను ఆ ముగ్గురు మొనగాళ్లు వెనక్కి నెట్టారు. మరి మెగా హీరోల స్థానాలు ఏవి, వీరిని వెనక్కి నెట్టిన హీరోలు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన టాప్ 10 హీరోల లిస్టులో నెంబర్ వన్ స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. సలార్ సినిమాతో బాక్సాఫీసును షేర్ చేసిన ఈయన చాలా కాలంగా టాప్ 1 పొజిషన్ లోనే కొనసాగుతున్నారు. ఇక టాప్ 2లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ సినిమా తీసేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు నమోదు అయ్యాయి.

ఇక టాప్ 3 స్థానంలో నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఈయన కూడా గతేడాది ఎలాంటి సినిమాలు చేయకపోయినా ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమాతో ఆయన ట్రెండింగ్ లోకి వచ్చాడు. అలాగే టాప్ 4లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది ఏ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కానీ ఈయన హీరోగా చేస్తున్న పుష్ప 2కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది మధ్యలో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాను అంతా చూడాలనుకుంటున్నారు. అలాగే ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. అలా ఈయన టాప్ లో నిలించారు.
ఇక ఐదో స్థానంలో అంటే టాప్ 5లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత నుంచి ఈయనకు సంబంధించిన ఒక్క సినిమా నేటి వరకు రిలీజ్ కాలేదు. కానీ ఈయనకు ఉన్న క్రేజ్ మాత్రం అస్సలే తగ్గట్లేదు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఈయన హీరోగా గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇక ఆరో స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిలిచారు. ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న ఈయన త్వరలోనే ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక టాప్ 7లో నాచురల్ స్టార్ నాని ఉన్నారు. గతేడాది హాయ్ నాన్న సినిమాతో వచ్చి అందరినీ తెగ అలరించిన ఈయన ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతున్నారు.
ఇక టాప్ 8లో మాస్ మహారాజా రవితేజ నిలిచారు. టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయినా ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతున్నారు. ఇక టాప్ 9లో మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారీ స్టార్ హీరో. ఇక టాప్ 10లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నిలిచారు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చిన ఈయన ట్రెండింగ్ లోనే ఉన్నారు. మొదటి మూడు స్థానాల్లో ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లే నిలవగా.. మిగతా స్థానాల్లోనే మెగా హీరోలు ఉన్నారు.


Click it and Unblock the Notifications











