Top 10 Heros: మళ్లీ మెగా హీరోలదే హవా.. ఎప్పటిలాగే బాలయ్య బాబు.. టాప్ 10లో ఎవరెవరున్నారంటే?
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ రంగాలు, సినిమాలు, సినీ తారలు, వెబ్ సిరీస్ లు ఇలా అన్నింటిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ సరైన ఫలితాలు వెల్లడించడంలో ఎప్పుడూ ముందుంటుంది ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్. తాజాగా మార్చి 2024కి సంబంధించి తెలుగు టాప్ హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 హీరోల పేర్లను ఎక్స్ వేధికగా విడుదల చేసింది. ఇందులో ఎప్పటిలాగే మెగా హీరోలే హవా సృష్టించారు. అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ అసలు స్థానమే దక్కించుకోలేకపోయారు. అయితే టాప్ 10 హీరోల లిస్టులో ఎవరెవరు స్థానం దక్కించుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన 2024 మార్చి నెలకు సంబంధించిన టాప్ 10 హీరోల లిస్టులో నెంబర్ వన్ స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. సలార్ సినిమాతో బాక్సాఫీసును షేర్ చేసిన ఈయన చాలా కాలంగా టాప్ 1 పొజిషన్ లోనే కొనసాగుతున్నారు. ఇక టాప్ 2లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన రౌజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.

ఇక మూడో స్థానంలో నిలిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది ఏ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కానీ ఈయన హీరోగా చేస్తున్న పుష్ప 2కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది మధ్యలో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాను అంతా చూడాలనుకుంటున్నారు. అలాగే ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. అలా ఈయన టాప్ లో నిలించారు. ఇక టాప్ 4లో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఈయన కూడా గతేడాది ఎలాంటి సినిమాలు చేయకపోయినా ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమాతో ఆయన ట్రెండింగ్ లోకి వచ్చాడు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాప్ 5లోకి వచ్చారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నుంచి ఈయనకు సంబంధించిన ఒక్క సినిమా కూడా ఇప్పటికీ విడుదల కాలేదు. అయితే శంకర్ డైరెక్షన్ లో ఈయన హీరోగా గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇక ఆరో స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిలిచారు. ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న ఈయన త్వరలోనే ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఏడో స్థానంలో నాచురల్ స్టార్ నాని ఉన్నారు. గతేడాది హాయ్ నాన్న సినిమాతో వచ్చి అందరినీ తెగ అలరించిన ఈయన ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతున్నారు.
ఇక టాప్ 8లో మాస్ మహారాజా రవితేజ నిలిచారు. టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయినా ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతున్నారు. ఇక టాప్ 9లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నిలిచారు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చిన ఈయన ట్రెండింగ్ లోనే ఉన్నారు. ఇక చివరి స్థానంలో అంటే పదో స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారీ స్టార్ హీరో. ఇలా 4 స్థానాల్లో మెగా హీరోలే నిలిచారు. కానీ ప్రభాస్, మహేష్ బాబులను మాత్రం టచ్ చేయలేకపోయారు.


Click it and Unblock the Notifications











