India Top 10 Heroes: ప్రభాస్‌కు దెబ్బేసిన ఆ ఇద్దరు.. ఇండియాలో టాప్ 10 హీరోలు వీళ్లే!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వే నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా డిసెంబర్ 2023కి సంబంధించి ఇండియాలో ఉన్న టాప్ 10 హీరోలు వీరే అంటూ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను ఆర్మాక్స్ తన సోషల్ మీడియా వేదికగా పోస్టును షేర్ చేసింది. అయితే తాజా లిస్టులో ప్రభాస్ ను ఇద్దరు హీరోలు వెనక్కి నెట్టారు. ఇక ఎప్పటి మాదిరిగానే తన సత్తా చాటుకుంటూ షారుఖ్ ఖాన్ మొదటి స్థానంలో ఉంటూ తనకు తిరుగులేదనిపించుకున్నాడు. మిగతా హీరోలు ఎవరు ఏ స్థానంలో వారు నిలిచారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హీరోలు, హీరోయిన్ల విషయంలో ఎవరూ టాప్ అనేది ఎప్పటికీ ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు. అభిమానులు మా హీరో తోపు.. మా హీరోయిన్ నెంబర్ 1 అనుకుంటూ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వచ్చాక ఈ వార్స్‌కి లెక్కే లేకుండా పోయింది. ముఖ్యంగా ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు టాలీవుడ్లో ఈ ఫ్యాన్స్ పంచాయితీ కాస్త ఎక్కువే.

అలాంటి సమయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఆర్మాక్ మీడియా సంస్థ డిసెంబర్ 2023కు గానూ ఇండియాలో టాప్ హీరోయిన్లు వీరే అంటూ ఓ జాబితాను రిలీజ్ చేసింది. ప్రతినెల సోషల్ మీడియాలో, జనాల్లో, సినిమాల్లో ఎవరూ టాప్‌లో ఉంటారో వారి లిస్ట్ తయారు చేసి ఆర్మాక్స్ విడుదల చేస్తుండగా.. తాజాగా ఇండియాలో టాప్ 10 హీరోల లిస్టును రిలీజ్ చేసింది.
ఇండియాలో టాప్ 1 హీరోగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నిలిచాడు. ఆయన గత ఏడాది జవాన్, పఠాన్, డంకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యాడు. ఇక టాప్ 2 స్థానంలో దళపతి విజయ్ నిలిచాడు. విజయ్ గత ఏడాది వారసుడు, లియో చిత్రాలతో ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు గోట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఇండియాలో టాప్ 10 హీరోల్లో ప్రభాస్ మూడో స్థానంలో నిలిచాడు. టాలీవుడ్ లో టాప్ 1 స్థానంలో ఉండే ప్రభాస్.. ఇప్పుడు ఇండియా వైడ్ గా మాత్రం టాప్ 3లో నిలిచాడు.

ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి చిత్రాలు చేస్తున్నాడు. ఇవి ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. ఇక టాప్ 4 స్థానంలో రణబీర్ కపూర్ నిలిచాడు. ఆయన గత ఏడాది యానిమల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ కొట్టాడు. ఇక టాప్ 5 స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచాడు. ఈ హీరో గత ఏడాది టైగర్ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
ఇక టాప్ 6లో తమిళ హీరో అజిత్ కుమార్ నిలువగా.. టాప్ 7లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. టాప్ 8లో అక్షయ్ కుమార్ నిలువగా... ఇక టాప్ 9లో జూనియర్ ఎన్టీఆర్ నిలిచాడు. దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. టాప్ 10లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నిలిచాడు. ప్రస్తుతం గుంటూరు కారం సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు మహేష్. ఆ తర్వాత రాజమౌళితో తన నెక్ట్స్ ప్రాజెక్టు మొదలుపెట్టనున్నాడు. ఇవండీ టాప్ 10 ఇండియా హీరోల లిస్టు.


Click it and Unblock the Notifications











