Top 10 Heros: టాలీవుడ్ టాప్ 10 హీరోలు వీళ్లే.. పవన్ కల్యాణ్‌ను వెనక్కి నెట్టిన ఐదుగురు అందగాళ్లు.. ఎవరంటే?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి అందిరకీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ తారలపై, సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా డిసెంబర్ 2023కి సంబంధించి తెలుగు టాప్ హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 హీరోల పేర్లను ఎక్స్ వేధికగా విడుదల చేసింది. అయితే టాప్ వన్ స్థానంలో ప్రభాస్ ఉండగా.. పవన్ కల్యాణ్ ఆరో స్థానానికి చేరిపోయాడు. అలాగే నందమూరి బాలకృష్ణ పదో స్థానానికి పరిమితం అయ్యాడు. మిగతా స్థానాల్లో ఎవరెవరు ఉన్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హీరోలు అయినా హీరోయిన్లు అయినా సరే ఎప్పుడూ సెలబ్రిటీల నెంబర్లు మారుతూనే ఉంటాయి. వారు తీసే సినిమాలు, అందులో వారు పెర్ఫార్మెన్స్ బట్టి కూడా ఈ లిస్టు మారుతూ ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే లిస్టులోకి చివరకు రావచ్చు, లేదా ఫస్ట్ రావచ్చు. ఈ జాబితా పూర్తిగా అబిమానులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ లిస్టులో టాప్ వన్ ప్లేస్ లో ప్రభాస్ చేరిపోయాడు. సలార్ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తున్న ఈయన మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.

2024 Top 10 Heros in India: Prabhas, Jr NTR, Allu Arjun, Maheh babu, Ram Charan Full Details Here

అలాగే జూనియర్ ఎన్టీఆర్ రెండో స్థానానికి పరిమితం అయ్యాడు. 2023లో ఈయన ఏ సినిమా చేయకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమాతో ఆయన ట్రెండింగ్ లోకి వచ్చాడు. అలాగే మూడో స్థానంలో నిలిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా 2023లో ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. ఈయన హీరోగా రాబోతున్న పుష్ప 2.. ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుండగా.. ఆయన కూడా ట్రెండింగ్ లోకి వచ్చారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు.. నాలుగో స్థానికి చేరారు. తాజాగా ఈయన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

2024 Top 10 Heros in India: Prabhas, Jr NTR, Allu Arjun, Maheh babu, Ram Charan Full Details Here

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐదో స్థానంలో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈయన కూడా ఒక్క సినిమాలో కనిపించలేదు. గేమ్ ఛేంజర్ తో ఈ ఏడాది వచ్చేందుకు సిద్ధం అవుతుండగా.. టాప్ 10 హీరోల లిస్టులో5వ స్థానంలో నిలిచాడు. అబ్బాయి ఐదో స్థానంలో ఉండగా.. బాబాయి మాత్రం ఆ తర్వాతి స్థానం 6కు చేరిపోయారు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాతో ఈ ఏడాది మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక 7వ స్థానంలో నాచురల్ స్టార్ నాని ఉన్నారు. ఇటీవలే ఈయన హాయ్ నాన్న సినిమాతో వచ్చి అందరినీ తెగ అలరించారు.

2024 Top 10 Heros in India: Prabhas, Jr NTR, Allu Arjun, Maheh babu, Ram Charan Full Details Here

ఇక ఎనిమిదవ స్థానంలో మాస్ మహారాజా రవితే ఉండగా... రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 9వ స్థానంలో నిలిచాడు. విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాతో 2023లో ప్రేక్షకుల ముందుకు రాగా ఎలాంటి ఉపయోగమూ లేకుండా పోయింది. ఇక ఇటీవలే నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. టాప్ 10 టాలీవుడ్ హీరోలలో బాలయ్య బాబు 10వ స్థానంలో నిలిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X