Top 10 Heros: బాలీవుడ్‌ను ఏలేస్తున్న టాప్ 10 హీరోలు వీళ్లే.. మొదటి స్థానంలో బాద్ షా, టూలో కండలవీరుడు!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి అందిరకీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ తారలపై, సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా డిసెంబర్ 2023కి సంబంధించి బాలీవుడ్ హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 హీరోల పేర్లను ఎక్స్ వేధికగా విడుదల చేసింది. అయితే టాప్ వన్ స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉండగా.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే బాలీవుడ్ ను ఏలేస్తున్న టాప్ 10 హీరోల లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కథానాయకులు అయినా కథానాయికలు అయినా సరే ఎప్పుడూ సెలబ్రిటీల నెంబర్లు మారుతూనే ఉంటాయి. వారు తీసే సినిమాలు, అందులో వారి పెర్ఫార్మెన్స్ బట్టి కూడా ఈ లిస్టు మారుతూ ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే లిస్టులోకి చివరకు రావచ్చు, లేదా ఫస్ట్ రావచ్చు. ఈ జాబితా పూర్తిగా అబిమానులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఈ లిస్టులో టాప్ వన్ ప్లేస్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నిలిచారు. గతేడాది జవాన్, పఠాన్, డంకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెక్ అయ్యాడు.

ఇక టాప్ లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఈయన గతేడాది టైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేయలేకపోయాడు. ఇక టాప్ 3లో అక్షయ్ కుమార్ నిలిచారు. చివరగా ఆయన రామ్ సేతు, 2.0 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే టాప్ 4లో హృతిక్ రోషన్ టైగర్ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు. ఇక టాప్ 5లో రణ్ బీర్ కపూర్ నిలిచారు. ఇటీవలే యానిమల్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడీ యంగ్ హీరో.

అలాగే టాప్ 6లో కార్తీక్ ఆర్యన్ నిలిచారు. గతేడాది షెబ్ జాదా, తు ఝూతీ మైన్ మక్కర్, సత్య ప్రేమ్ కీ కథ వంటి చిత్రాలతో వచ్చాడు. ప్రస్తుతం చందు ఛాంపియన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక టాప్ 7లో రణ్ వీర్ సింగ్ నిలిచారు. ఈయన గతేడాది రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించారు. అలాగే టాప్ 8లో అజయ్ దేవగన్ నిలిచారు. గతేడాది బోళా సినిమాతో వచ్చిన ఈయన ఈ ఏడాది సింగం 3 సినిమాతో వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇక టాప్ 9లో ఆమిర్ ఖాన్, టాప్ 10లో వరుణ్ ధావన్ లు ఉన్నారు.



Click it and Unblock the Notifications











