Top 10 Heros: మెగా ఫ్యామిలీ హీరోల ఎంట్రీతో బాలకృష్ణ ఔట్.. టాప్ 10 హీరోల్లో నాలుగు స్థానాలు వారికే!
ఏ ఇండస్ట్రీలో అయినా సరే కొన్ని కుటుంబాలకు చెందిన వాళ్లే ఎక్కువగా సినిమాలు చేస్తూ హవా కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా తెలుగులో నందమూరి, మెగా, అక్కినేని ఫ్యామిలీల హీరోలే ఎక్కువగా కనిపిస్తుంటారు. అందరికంటే ఎక్కువ అంటే మాత్రం మెగా ఫ్యామిలీ హీరోలే ఎక్కువ. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న టాప్ 10 హీరోల లిస్టును ఆర్మాక్స్ సంస్థ విడుదల చేయగా.. అందులో నాలుగు స్థానాలను మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులే దక్కించుకున్నారు. వీరి దెబ్బతో మొన్నటి వరకు టాప్ 10 లిస్టులో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం ఇందులోంచి బయటకు వచ్చేశాడు.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ టాప్ 10 టాలీవుడ్ హీరోల లిస్టులో ఎప్పటిలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా ఆయన సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి టాప్ 1లోకి వచ్చేసారు. ముందు ముందు రాబోయే సినిమాలపై కూడా ఇప్పటికే పుల్ బజ్ క్రియేట్ కాగా.. అదే స్థానాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో మాత్రం నలుగురు మెగా హీరోలు ఉన్నారు. పూర్తి లిస్టులో ఎవరెవరు ఉన్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 1లో ప్రభాస్ ఉండగా.. టాప్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఒకే ఒక్క హీరో టాప్ 10 లిస్టులోకి వచ్చాడు. ఇక టాప్ 3లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడీ యంగ్ హీరో. ఇక నాలుగో స్థానంలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ నిలిచాడు. ఈయన పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా.. ఆయనపై కూడా విపరీతమైన బజ్ ఏర్పడింది.

ఇట టాప్ 5లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. ఇక ఆరో స్థానంలో మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉన్నారు. ఈయన సినిమాలు ఏమీ రాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ఈయన క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అందుకే ఆయన టాప్ 10 హీరోల లిస్టులో ఉన్నారు. ఇక టాప్ 7లో నాచురల్ స్టార్ నాని నిలిచారు. ఇటీవలే హాయ్ నాన్నతో సూపర్ డూపర్ హిట్టు కొట్టాడీ యంగ్ హీరో.

టాప్ 8లో మెగా ఫ్యామిలీకి చెందిన మెయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. విశ్వంభర సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి అలరించనున్న ఈయనకు, విశ్వంభర సినిమాతో క్రేజ్ మరింత ఎక్కువ అయింది. ఇక టాప్ 9లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నిలిచాడు. ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈయన సిద్ధంగా ఉన్నాడు. ఇక టాప్ 10లో మాస్ మహారాజ రవితేజ నిలిచారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈగల్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు ఈయన రెడీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











