Top 10 Heros: టాప్ 10 తెలుగు హీరోల్లో మళ్లీ మెగా ఫ్యామిలీదే హవా.. కానీ వారిని మాత్రం ఆపలేకపోయారు!

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల అందరికీ తెలిసిందే. దేశంలోని అన్ని సినీ రంగాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ.. సరైన ఫలితాలను వెల్లడిస్తుంటుంది. ముఖ్యంగా సినీ తారలు, సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇలా అన్నింటిపై సర్వేలు చేస్తుంటుంది. తాజాగా డిసెంబర్ 2024 జనవరి నెలకు సంబంధించి తెలుగు టాప్ హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 హీరోల పేర్లను ఎక్స్ వేధికగా ప్రకటించింది. ఎప్పటిలాగే ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా మెగా హీరోలు నలుగురు టాప్ 10 హీరోల్లో స్థానం దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు.

కథానాయకులు అయినా, కథానాయికలకు అయినా సరే.. ఎప్పటికప్పుడు వారి జాబితాలో ర్యాంకింగ్ నెంబర్ మారుతూనే ఉంటుంద. ముఖ్యంగా వీరు తీసే సినిమాలు, అందులో పర్ఫార్మెన్స్ ను బట్టి ఈ లిస్టు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే వారు టాప్ లోకి రావచ్చు.. అలాగే ఫ్లాప్ అయితే చివరకు పడిపోవచ్చు. ఈ జాబితా పూర్తిగా అబిమానులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే జనవరి నెలల నిర్వహించిన సర్వేలో టాప్ 10 టాలీవుడ్ హీరోల లిస్టులో ఎవరెవరు ఉన్నారు.. ఏయే స్థానాల్లో ఉన్నారో మనం ఇప్పుడు తెలుసకుందాం.

2024 Top 10 Heros in Tollywood: Prabhas, Mahesh babu, Allu Arjun, Jr NTR Full Details Here

పాన్ ఇండియా ప్రభాస్ ఎప్పటిలాగే మొదటి స్థానంలో నిలిచాడు. సలార్ తో సూపర్ హిట్ కొట్టిన ఈయన స్థానాన్ని ఎవరూ లాక్కోలేకపోతున్నారు. ఇక టాప్ 2లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈయన.. టాప్ 4 నుంచి టాప్ 2కి ఎగబాకాడు. ఇక టాప్ 3లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిలిచాడు. గతేడాదిలో ఒక్క సినిమా కూడా చేయని ఆయన.. ఈ ఏడాది పుష్ప2తో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

2024 Top 10 Heros in Tollywood: Prabhas, Mahesh babu, Allu Arjun, Jr NTR Full Details Here

ఇక యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాలుగో స్థానానికి పరిమితం అయ్యాడు. 2023లో ఈయన ఏ సినిమా చేయకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమాతో ఆయన ట్రెండింగ్ లోకి వచ్చాడు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐదో స్థానంలో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈయన కూడా ఒక్క సినిమాలో కనిపించలేదు. గేమ్ ఛేంజర్ తో ఈ ఏడాది వచ్చేందుకు సిద్ధం అవుతుండగా.. టాప్ 10 హీరోల లిస్టులో5వ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిలిచారు.

2024 Top 10 Heros in Tollywood: Prabhas, Mahesh babu, Allu Arjun, Jr NTR Full Details Here

రాజకీయాల్లోకి వెళ్లి చేసే ప్రాజెక్టులు అన్నింటిని ఆపిన ఈయన.. కొత్త సినిమా అప్ డేట్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇలా ఈయన టాప్ లోకి వచ్చేశాడు. ఇక టాప్ 7లో నాచురల్ స్టార్ నాని ఉన్నారు. ఇటీవలే ఈయన హాయ్ నాన్న సినిమాతో వచ్చి అందరినీ తెగ అలరించారు. ఇక ఎనిమిదవ స్థానంలో మాస్ మహారాజా రవితే ఉండగా... రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 9వ స్థానంలో నిలిచాడు. ఫ్యామిలీ స్టార్ తో త్వరలోనే ఈయన ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నారు. ఇకా టాప్ 10లో మెగాస్టార్ చిరంజీవి ఉండగా... బాలకృష్ణ ఎలాంటి స్థానాన్ని దక్కించుకోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X