"30 లక్షల ఉద్యోగం వదిలి సినిమాల్లోకి వచ్చాను.. అదే జరిగుంటే నాకు పెళ్లి కూడా కాకపోయేది"
30 వెడ్స్ 21.. ఈ వెబ్ సిరీస్ చూడని తెలుగు సిని ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదేమో. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చి అందరినీ అలరించిన ఈ వెబ్ సిరీస్ అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా ఇందులోని హీరోహీరోయిన్లకు ఈ వెబ్ సిరీస్ ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చింది. అలా వచ్చిన ఫేమ్ తోనే వీళ్లు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ హీరో షరతులు వర్తిస్తాయ్ అనే సినిమా చేశారు.
మార్చి 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుండగా.. చిత్రబృందం సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది. ముఖ్యంగా దర్శక, నిర్మాతలు, హీరోహీరోయిన్లు.. గ్రూపుగా ఓసారి, ఒంటరిగా ఓసారి ఇంటర్వ్యూలో ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ టీం ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. చైతన్య రావు షాకింగ్ కామెంట్లు చేశారు. తాను 30 లక్షల ఉద్యోగం వదులుకుని సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చైతన్య రావు 2015లో బందూక్ అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అగుడు పెట్టారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు. కానీ వాటేవిటీ వల్ల ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ 31 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. అలా వెబ్ సిరీస్ లో ఆయన నటను చూసిన చాలా మంది ఆయనకు సినిమా అవకాశాలు ఇచ్చారు. ఇలా హీరోగా మారిడీ కుర్రాడు. ఇటీవలే కీడా కోలా సినిమాలో కనిపించి తన టాలంట్ ప్రూవ్ చేసుకున్నాడు.
ఇలా విభిన్నమైన కథలతో వస్తూ.. ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటున్న ఈ యంగ్ హీరో తాజాగా షరతులు వర్తిస్తాయ్ అనే సినిమా చేశాడు. కుమార స్వామి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో చైతన్య రావు హీరోగా చేస్తుండగా.. భూమి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. మార్చి 15వ తేదీ అంటే శుక్రవారమే విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు హీరో.

అక్కడే చైతన్య రావు తనకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించాడు. తన తండ్రి రేషన్ షాప్ నడుపుతుండగా... తన తల్లి టీచర్ అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చాలా కష్టపడి తనని చదివించారని.. విదేశాల్లో తాను విద్యనభ్యసించినట్లు వివరించాడు. అయితే సినిమాల మీద ఉన్న పిచ్చితో తాను ఏడాదికి 30 లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వదలుకుని ఇండియాకి వచ్చేసినట్లు తెలిపాడు.
నెలకు రెండున్నర లక్షలు సంపాధించే తాను సినిమాల్లోకి వస్తాను అనగానే.. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు కూడా చాలా తిట్టారని చైతన్య రావు పేర్కొన్నాడు. తనకు ఏం జరిగినా తాను సినిమాలు చేస్తానని వారితో చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చానని.. అదృష్టం బాగుండి తనకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని వివరించాడు. ఇలా సక్సెస్ కాలేకపోయి ఉంటే తనకు ఎవరూ అమ్మాయిని కూడా ఇచ్చే వాళ్లు కారంటూ వెల్లడించాడు.


Click it and Unblock the Notifications











