సౌత్‌లో నెం 2.. సూపర్ స్టార్ మహేష్ క్రేజీ రికార్డు!
సూపర్ స్టార్ మహేష్ బాబు మరో క్రేజీ రికార్డు సొంతం చేసుకున్నాడు. మహెష్ బాబు ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 7 మిలియన్ల దాటింది. దీనితో మహేష్ అభిమానులు ట్విట్టర్లో కొత్త హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. 2010 లో మహేష్ ట్విట్టర్ ఖాతా తెరిచాడు.
వేగంగా ఫాలోవర్స్ పెరుగుతూ ఇప్పటికి మహేష్ ఫాలోవర్స్ సంఖ్య 7 మిళియన్లకు చేరుకోవడం విశేషం. దీనితో దక్షిణాదిలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోలలో మహేష్ రెండవ స్థానంలో నిలిచాడు. తమిళ హీరో ధనుష్ తొలి స్థానంలో 7.78 మిలియన్ల ఫాలోవర్స్‌తో తొలి స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తరువాత కింగ్ నాగార్జునకు 5.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్సత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ సరసన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











