రామ్ చరణ్ కోసం టాలీవుడ్ హిస్టరీలో మునుపెన్నడూ లేని ఫీట్.. బయటకు వస్తున్న RC15 లీక్స్!రామ్ చరణ్ ప్రస్తుతం రాజ
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అలా ఉండగానే ఆయన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఒక రేర్ ఫీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

తాజా అప్డేట్
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RC15 సినిమా ఇటీవల ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్ డేట్ వచ్చింది.

రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో
నిజానికి ఇటీవలే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేశారు. సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15వ తేదీన మొదలుపెట్టింది సినిమా యూనిట్. ఈ షెడ్యూల్ లో చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్లోని కొన్ని రొమాంటిక్ సీన్స్‌ను చిత్రీకర్తిస్తున్నారని టాక్ అయితే నడుస్తోంది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారని ఈ సెట్ కోసం 40 కోట్లను ఖర్చు పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

మునుపెన్నడూ లేని విధంగా
ఈ సెట్ లో ఓ పాటతో పాటు కొన్ని యాక్షన్ సీన్స్ ను కూడా టీమ్ షూట్ చేయనుందని అంటున్నారు. ఈ సినిమా గురించి శంకర్ చేస్తున్న ప్రతి పని చర్చనీయాంశం అవుతోంది. తాజా సమాచారం మేరకు ఒక సాంగ్ డ్యాన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, యూరప్ మొదలైనవి దేశాల నుంచి 80 మంది విదేశీ నృత్యకారులను రప్పించారు అని టాక్ నడుస్తోంది. 10 రోజుల పాటు ఆ రిచ్ లొకేషన్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో డ్యాన్సర్లు ఇప్పటికే బస చేస్తున్నారు. ఇప్పటి వరకు మరే తెలుగు సినిమాకు కూడా ఈ రేంజ్ లో ఫారిన్ డ్యాన్సర్ లను ఇండియాలో వాడలేదని అంటున్నారు.

దిమ్మ తిరిగి పోయే డ్యాన్స్ నంబర్
ఈ డ్యాన్స్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారని అంటున్నారు. అంతేకాక ఈ డ్యాన్సర్ల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కూడా. ఇక రీసెంట్ గా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు 350 కోట్ల భారీ డీల్ చేసాడు. దిల్ రాజు జీ స్టూడియోస్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, ఆ డీల్ ప్రకారం RC15 యొక్క థియేట్రికల్, శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను జీ స్టూడియోస్ కు అమ్మేసినట్టే.
Recommended Video

భారీ బడ్జెట్తో
రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం అయితే వెలువడాల్సి ఉంది. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











