నీ నుంచి నాకు అది కావాలి.. హీరోని షాపింగ్ మాల్‌లో ఇబ్బంది పెట్టిన అమ్మాయి!
సినీ తారలు కనిపిస్తే అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం సహజమే. ఓ లేడి ఫ్యాన్ వలన తాను షాపింగ్ మాల్ లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నానని యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. అనితా ష్రాఫ్ నిర్వహిస్తున్న టివి షోకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ షోలో సోనమ్ కపూర్ కార్తీక్ ఆర్యన్, జాక్వెలిన్ వంటి నటులు పాల్గొన్నారు. తాజగా ఆయుష్మాన్ ఈషోలో మెరిశాడు.

సాహసోపేతమైన పాత్రలు
బోల్డ్ రోల్స్ చేస్తోంది అని ఎక్కువగా హీరోయిన్ల గురించే మాట్లాడుకుంటాం. అదే హీరోల గురించి మాట్లాడుకోవలసి వస్తే ఖచ్చితంగా ఆయుష్మాన్ గురించి మాట్లాడుకోవాలి. విక్కీ డోనర్, శుభ్ మంగళ్ సావధాన్ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నాడు.

విక్కి డోనర్
2012 లో ఆయుష్మాన్ హీరోగా విక్కీ డోనర్ చిత్రంలో పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో వీర్యం దానం చేసే పాత్రలో అద్భుత నటన కనబరిచి అందరిని ఫిదా చేశాడు. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ ని చక్కగా మలుచుకుంటున్నాడు.

అమ్మాయి అలా అడిగేసింది
విక్కీ డోనర్ చిత్రం విడుదలయ్యాక మా అమ్మతో కలసి షాపింగ్ మాల్ కు వెళ్ళా. మా అమ్మా చండీఘర్ నుంచి వచ్చిన సాధారణ మహిళ. ఓ అమ్మాయి తనని షాపింగ్ మాల్ నన్ను చూసి నువ్వంటే ఇష్టం. నీ వీర్యం ఇస్తావా అని అడిగేసింది. ఆమాటకు పక్కనే ఉన్న మా అమ్మ ఆశ్చర్యపోయింది.

ఏమైనా చేశావా
ఆశ్చర్యంతో మా అమ్మ అడుగుతూ.. ఆ అమ్మాయిని ఏమైనా చేశావా అని అడిగింది. ఊహించని ఘటన ఎదురుకావడంతో చాలా ఇబ్బందిగా అనిపించిందని ఆయుష్మాన్ తెలిపాడు. షాక్ నుంచి తేరుకుని.. ఇప్పుడు మా అమ్మతో వచ్చాను.. లేకుంటే నువ్వడిగిన ప్రశ్నకు బదులిచ్చేవాడిని అని నవ్వుతూ ఆ అమ్మాయికి చెప్పానని ఆయుష్మాన్ ట్ తెలిపాడు.

శుభ్ మంగళ్ సావధాన్
శుభ్ మంగళ్ సావధాన్ చిత్రంలో కూడా ఆయుష్మాన్ విభిన్నమైన పాత్ర పోషించాడు. అంగస్తంభన సమస్య ఉన్న భర్త పాత్రలో నటించి మెప్పించాడు. అలాంటి పాత్రల్లో నటించడం వలన నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించదని ఆయుష్మాన్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











