పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పవర్ ప్యాక్డ్ ప్రకటన.. ఈసారి అదొక్కటే కాదట !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ఏపీలో రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరో పక్క సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఆయన మరో నాలుగు సినిమాలకు ఓకే చెప్పారు, అందులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు స్క్రిప్ట్ పూర్తి చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉన్నాయి.

ఆ షూటింగ్ కి రెడీగా ఉన్న సినిమాలలో హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమా ఒకటి. తాజాగా హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ కు ఒక మంచి ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

వకీల్ సాబ్

వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలి సారి లాయర్ పాత్రలో కనిపించాడు, హిందీలో సూపర్ హిట్ సినిమా అయిన పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి స్పందన తెచ్చుకుంది.

ఫ్యాన్స్ కి ఫీస్ట్

ఫ్యాన్స్ కి ఫీస్ట్

అయితే ఆ సినిమా చేస్తునప్పుడే ఆయన మరో నాలుగు సినిమాలు ఒప్పుకున్నారు. అందులో జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ దశలో ఉంది, అలాగే నాగ వంశీ నిర్మాణంలో అయ్యప్పనుమ్ కోశియం రీమేక్ కూడా షూటింగ్ చివరి దశలో ఉంది ఈ సినిమాకి సాగర్ కే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మరో సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఓకే చేశారు. అయితే తాజాగా హరీష్ శంకర్ సంబంధించిన సినిమా అప్డేట్ ఒకటి రిలీజ్ చేస్తామని ఈరోజు అధికారికంగా ప్రకటించారు.

ఏం ప్రకటించబోతున్నారు?

ఏం ప్రకటించబోతున్నారు?

హరీష్ శంకర్ సినిమా షూటింగ్ జూలైలో మొదలు కావాల్సి ఉంది. కానీ సెకండ్ వేవ్ దెబ్బకు అన్ని ప్లాన్లు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూట్ వాయిదా పడింది. అయితే ఈ సినిమా నుంచి ఒక పవర్ ప్యాక్డ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నామని సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొనగా దానిని హరీష్ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అధికారిక ప్రకటన చేసే అవకాశం

అధికారిక ప్రకటన చేసే అవకాశం

ఇక ఈ సినిమాకు సంచారి, భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సినిమాలో పవన్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు అనే ప్రచారం కూడా జరిగింది ఈ విషయం మీద సరైన క్లారిటీ రావాల్సి ఉంది. బహుశా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Recommended Video

Bheemla Nayak పాటతో కిన్నెర మొగిలయ్య స్టార్ స్టేటస్.. ఏంటీ కాంట్రవర్సీ || Filmibeat Telugu
కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు

కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ సినిమా అంటే అంచనాలు పెరిగిపోతున్నాయి.. అంచనాలకు తగ్గట్టు గానే హరీష్ శంకర్ పూర్తి కమర్షియల్ అంశాలతో కూడిన స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలాగే ఒక ట్రావెలర్ పాత్రలో నటిస్తున్నాడు అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఈ సారి కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు అంతకు మించి అని చెబుతున్నారు. మరి రేపు ఏం రిలీజ్ చేయబోతున్నారు అనేది చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X