Mokshagnya: మోక్షజ్ఞ సినిమాకే రికార్డు బడ్జెట్.. ఎన్ని కోట్లు పెడుతున్నారో తెలుసా?
ఏ సినీ పరిశ్రమలో చూసినా కూడా నెపోటిజం.. వారసత్వంగా వచ్చే తారల పిల్లలు అంటూ చాలా మాటలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. కాగా వీటిని పట్టించుకునేవాళ్లు ఉంటారు.. వాటిని పట్టించుకోని వాళ్ళు కూడా ఉంటారు. అల్టిమేట్ గా టాలెంట్ ఉంటె కుటుంబం కూడా అవసరం లేదని చాలా మంది యంగ్ హీరోస్ ప్రూవ్ చేసారు.
అయితే ఇలా ఎప్పటికపుడు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా చాలా ఇండస్ట్రీస్ నుంచి కొత్త జెనరేషన్ వస్తూనే ఉంటారు. అయితే మన తెలుగులో ప్రస్తుతం ఎదురు చూస్తున్న ఎంట్రీ ఏదన్నా ఉంది అంటే అది నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి తారక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అని చెప్పాలి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి మోక్షు ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చూస్తున్న నిరీక్షణకు ఇటీవల బాలయ్య తెర దించేశారు.

అయితే బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం క్రేజీ ప్లానింగ్ కూడా సిద్ధం చేసారు. తెలుగులో మొట్టమొదటి సూపర్ హీరో జానర్ సినిమాని పరిచయం చేసి 300 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మతో డెబ్యూ ఇవ్వనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే ఈ చిత్రాన్ని తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా అనౌన్స్ చేయడం మరో క్రేజీ అంశంగా మారింది.
కాగా ఇపుడు ఈ భారీ ప్రాజెక్ట్ పై ఒక టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. బాలయ్య వారసుడు ఎంట్రీ కోసం మేకర్స్ కళ్ళు చెదిరే బడ్జెట్ ని పెడుతున్నారట. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాకి ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రం ఓ డెబ్యూ హీరో ఎంట్రీకి అత్యధిక బడ్జెట్ అని చెప్పాలి.
మరి మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాతో 100 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొడితే ఇప్పుడు బాలయ్య వారసుడికి కేవలం బడ్జెట్ గానే 100 కోట్లకి పైగా పెడుతున్నారు. అంటే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టాల్సి ఉందని చెప్పాలి. మరి ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్ తోనే హను మాన్ సినిమాకి మైండ్ బ్లాకింగ్ విజువల్స్ అందించాడు.
ఇక 100 కోట్ల బడ్జెట్ అంటే అది ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఇదొక్క సినిమానే కాకుండా హను మాన్ సీక్వెల్ జై హనుమాన్, అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో ఒక సినిమా అలాగే ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య వారసుడు కళ్యాణ్ దాసరితో "అధీరా" అనే సూపర్ హీరో ప్రాజెక్ట్ లని చేస్తున్నాడు. అయితే వీటిలో అధీరా ఎప్పుడో రెండేళ్ల కితమే అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా అసలు ఉందో లేదో కూడా తెలియని అర్ధం కాని పరిస్థితుల్లో ఉంది.


Click it and Unblock the Notifications











