రామ్‌ సినిమాలో మరో యంగ్ హీరో: అల్లు అర్జున్, పవన్ తర్వాత ఉస్తాద్‌తో ఫైటింగ్‌

ఈ మధ్య కాలంలో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని. ఈ జోష్‌లోనే ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీతో ఓ ఫిల్మ్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో నటించే నటీనటుల గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ సినిమాలో నటించే విలన్‌ను పరిచయం చేసింది చిత్ర యూనిట్.

రామ్ పోతినేని - లింగుసామీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కోలీవుడ్ హీరో మాధవన్ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, దీన్ని ఆయన ఖండించారు. ఆ తర్వాత ఈ పాత్ర కోసం పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇందులో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు అతడికి స్వాగతం పలుకుతూ హీరో రామ్ కూడా ట్వీట్ చేశాడు. గతంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన ఆది.. అల్లు అర్జున్ 'సరైనోడు', పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

Aadhi Play Negative Role in Ram Pothineni - Lingusamy Movie

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని డుయల్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ రోల్ అని కూడా అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. నదియా కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రానికి 'ఉస్తాద్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X