బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ రీఎంట్రీకి బ్రేక్.. ఇక మెగా హీరోకు లైన్ క్లియర్.. !?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్, మల్టీ టాలెంటెండ్ హీరో అమీర్ ఖాన్. ఆయన విభిన్న పాత్రల్లో నటించి.. గ్రేట్ యాక్టర్ అని నిరూపించుకున్నారు. అయితే.. గత రెండు సంవత్సరాలుగా వెండి తెరకు దూరంగా ఉన్న ఈ హీరో 'సితారే జమీన్ పర్'అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీ బస్టర్ హిట్ 'తారే జమీన్ పర్' సినిమాకు సీక్వెల్ లాగా వస్తున్నది. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ముందుగా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది ప్రకటించారు. అంతకు ముందు ఆయన నటించిన 'లాల్ సింగ్ చద్దా' మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో దాదాపు రెండు సంవత్సరాలు బ్రేక్ తీసుకున్న అమీర్ క్రిస్మస్ వేళ థియేటర్లలో సందడి చేయబోతున్నారని ఆయన ఫ్యాన్ ఎంతగానో ఎదురు చూశారు. కానీ, సినిమా నిర్మాణ పనుల్లో కాస్త జాప్యం జరగడంతో మరికొంత కాలం ఆగాల్సిందేనని బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ'గేమ్ ఛేంజర్'(Game Changer).పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దికుంటున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. అయితే.. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందని, వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టారు నిర్మాత దిల్ రాజ్. ఇటీవల ఆయన ఓ ఫిల్మ్ ఈవెంట్ లో పాల్గొని ఈ మూవీ విడుదలపై ఓ క్లారిటీ ఇచ్చారు. అంతకముందు చెప్పినట్టు ఈ ఏడాది క్రిస్మస్‌కే సినిమా విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందనీ, రామ్ చరణ్, శంకర్ ఇమేజ్‌ను ఈ మూవీ మరింత పెంచుతుందనీ. తాము భారీ విజయం సాధించబోతున్నమని అన్నారు. పొలికల్, యాక్షన్ డ్రామా గా వస్తున్నా ఈ మూవీ మెగా ఫ్యాన్స్ కు పుల్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వబోతుందని తెలిపారు. ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్ గా, అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని లీడ్ లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

వాస్తవానికి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', చాలా రోజులు తరువాత అమీర్ ఖాన్ రీ ఎంట్రీ మూవీ 'సితారే జమీన్ పర్'బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయనీ, ఇందులో ఏ హీరో విజయం సాధిస్తారు? ఏ మూవీ కాసుల వర్షం కురిపించబోతుందని మూవీ లవర్స్ ఉత్కంఠంగా ఎదురు చూశారు.నిజానికి పాన్ ఇండియా మూవీస్ హిందీ మార్కెట్ చాలా కీలకం. ఇందుకు బెస్ట్ ఎక్జాప్ కల్కి 2898 AD. ఈ మూవీ కేవలం హిందీ వెర్షన్ నుండి 400 కోట్లు వసూలు చేసింది. అదే హోప్ తో పుష్ప 2, జూనియర్ ఎన్టీఆర్ దేవర బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కోట్టాలని భావిస్తున్నాయి. ఈ మూవీస్ కూడా నార్త్ మార్కెట్ వైపే చూస్తున్నాయి. వీటితో పాటు రామ్ చరణ్- శంకర్ క్రేజీ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టలని భావిస్తుంది. ఈ సినిమాతో మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. కానీ, అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ అడ్డంకి మారబోతుందని భావించారు. ఇప్పుడు.. సితారే జమీన్ పర్ వాయిదా వేయడంతో రామ్ చరణ్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఈ ఉత్కంఠ పోరుకు తెరపడినట్టేనని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











