అమీర్ ఖాన్‌ను ఛీ కొట్టిన సౌత్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆయనే 3 ఇడియెట్‌లో రాంచో పాత్రకు స్పూర్తినట!

ఇండియన్ సినిమా పరిశ్రమలో అమీర్ ఖాన్ మిస్టర్ ఫర్‌పెక్ట్ అనే పేరుంది. ఆయన ఎంచుకొనే చిత్రాలు, నటించే పాత్రలు అందరికి స్పూర్తిగా నిలుస్తాయి. అయితే అలాంటి నటుడు ఓ పాత్రను చేయాలనుకొనే సమయంలో దక్షిణాది దర్శకుడు మురగదాస్‌ను ఇన్సిపిరేషన్‌గా తీసుకొన్నాడట. అయితే కొన్నిసార్లు నచ్చకపోతే మురగదాస్ చీకొట్టే వాడనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా వెల్లడించాడు. ఇండియాలో పాపులర్ కామెడీ షో కపిల్ శర్మ షోలో తాజాగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ విషయాల్లోకి వెళితే..

రాజ్‌కుమార్ హిరాణీ నాకు 3 ఇడియట్ కథ చెప్పి..18 ఏళ్ల యువకుడిగా నటించాలని చెప్పారు. అయితే ఆ పాత్ర చేయడం అసాధ్యం అనిపించింది. ఎందుకంటే.. అప్పటికే నా వయసు 40 ఏళ్లకుపైగానే ఉంది. ఆ పాత్రలో 18 ఏళ్ల యువకుడిగా నటించడం.. బిహేవ్ చేయడం చాలా కష్టమని అనుకొన్నాను అని అమీర్ ఖాన్ చెప్పాడు.

Aamir Khan praises AR Murugadoss as Filterless Ghajini Actor said He is the Inspiration for Rancho of 3 Idiots

అయితే.. ఆ పాత్ర చేయాలని అనిపించినప్పుడు నాకు మురగదాస్ గుర్తుకు వచ్చాడు. ఎందుకంటే ఆయన గొప్ప దర్శకుడు. చాలా పొట్టిగా ఉంటాడు. ఆయన కథ చెప్పేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ టిపికల్‌గా ఉంటుంది. ఆయన నాకు కథ చెప్పేటప్పుడు రెండు చేతులు మోకాళ్ల మధ్యలో ఇరికించి కథ చెబుతాడు. చాలా చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయనది. ఆయన బాడీ లాంగ్వేజ్‌ను పట్టుకొని 3 ఇడియట్ సినిమాలో రాంచోదాస్ అలియాస్ రాంచో పాత్రలో ఒదిగిపోయాను అని అమీర్ ఖాన్ చెప్పాడు.

ఇదే కాకుండా మురగదాస్‌లో మరో గొప్ప లక్షణం ఉంది. ఆయనకు ఫిల్టర్లు ఉండవు. తనకు ఏది అనిపిస్తే.. ముందు ఎవరు ఉన్నారనేది కూడా ఆలోచించడు. తను చెప్పాలనుకొన్న విషయాన్ని ముఖం ముందే చెప్పేస్తాడు. ముఖస్తుతి కోసం కూడా మెప్పించే ప్రయత్నం చేయడు. నచ్చకపోతే.. మరో నిమిషం ఆలోచించడు అని అమీర్ ఖాన్ తెలిపాడు.

Aamir Khan praises AR Murugadoss as Filterless Ghajini Actor said He is the Inspiration for Rancho of 3 Idiots

అయితే కథ గురించి గానీ, సన్నివేశాలు గురించి నేను ఏదైనా చెబితే.. తనకు నచ్చకపోతే.. ఛీ ఛీ.. బాగాలేదు అని ముఖం మీదే చెప్పేస్తాడు. నచ్చితే.. అబ్బో సూపర్.. సూపర్.. సూపర్ అంటూ చప్పట్లు కొడుతూ చిన్న పిల్లాడిలా ఆనందించేస్తాడు. కానీ మనం ఏదైనా నచ్చకపోతే.. ఇలా ఉంటే బాగుంటుందేమో.. అలా ఉంటే బాగుంటుందేమో అని స్మూత్‌గా తిరస్కరించే ప్రయత్నం చేస్తా. కానీ మురగదాస్‌కు మాత్రం ఎవరేమనుకొంటారో అనే విషయం ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టే చెబుతాడు అని అమీర్ ఖాన్ వెల్లడించాడు.

మురుగదాస్ వ్యవహరించే తీరును రాంచో పాత్రలో దించేశాను. ఆ పాత్రకు వచ్చిన ప్రశంసలకు కారణం మురుగదాస్ మాత్రమే. ఆయనలో గొప్ప డైరెక్టరే కాదు.. మంచి మనిషి కూడా ఉన్నాడు. నాకు బాగా నచ్చిన డైరెక్టర్లలో ఆయన ఒకరు. గజిని సినిమా సమయంలో నేను బాగా కనెక్ట్ అయ్యాను అని కపిల్ శర్మతో అమీర్ ఖాన్ తన భావాలను పంచుకొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X