ఆ రెండు గంటలు.. నాగచైతన్యపై అమీర్ ఖాన్ ప్రశంసల వర్షం
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ రూపొందిసున్న లాల్ సింగ్ చద్దా మూవీతో అక్కినేని చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ లడఖ్ పర్వత ప్రాంతంలో నిర్విరామంగా జరుగుతున్నది. ఇటీవలే నాగచైతన్య చిత్ర యూనిట్‌తో కలిసి షూటింగులో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నాగచైతన్య గురించి అమీర్ ఖాన్ చెబుతూ ప్రశంసల వర్షం కురిపించారు.

ఆ రెండు గంటలు
లడఖ్ ప్రాంతంలో మేము ఉండే హోటల్స్‌కు, షూటింగుకు గంట ప్రయాణం ఉంటుంది. మేము ప్రతీ రోజు కారులో షూటింగ్ లొకేషన్‌కు చేరుకొంటాం. నేను, చైతూ ఒకే కారులో కలిసి ప్రయాణిస్తుంటాం. కారులో ప్రయాణించేటప్పుడు చైతూ గడిపే సమయం చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంటుంది. షూటింగ్ ప్రదేశానికి వెళ్లడం ఒక గంట, రావడం ఒక గంట పడుతుంది. అలా రోజు రెండు గంటలపాటు మా మధ్య గొప్పగా అనుభవాలు ఉన్నాయి. చాలా మంచి విషయాలు చర్చించుకొనే అవకాశం లభించింది అని అమీర్ ఖాన్ అన్నారు.

మంచి టైమ్ ఎంజాయ్ చేశాం
నాగచైతన్యతో సినిమా ప్రయాణం గొప్పగా ఉంది. అతడి సిన్సియారిటీ నాకు నచ్చింది. కెరీర్‌పైన చైతూకు ఉండే అంకితభావం నన్ను ఆకట్టుకొంది. మంచి టైమ్‌ను ఎంజాయ్ చేశాం అని అమీర్ ఖాన్ తెలిపారు. నాగచైతన్యతో అనుబంధాన్ని ప్రత్యేకంగా మీడియాకు వెల్లడించడం విశేషంగా మారింది.

అమీర్, చైతూ ఫోటోలు వైరల్
ఇటీవల నాగచైతన్య, అమీర్ ఖాన్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. షూటింగ్‌లో కొంత గ్యాప్ రావడంతో చిత్ర యూనిట్ సభ్యులందరికీ టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించారు. నాగచైతన్య కూడా ఆ పోటీలో చురుకుగా పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకొన్నాయి.
Recommended Video

ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా
లాల్ సింగ్ చద్దా మూవీ హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే భార్య నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్ బాధ్యతలను అమీర్ మాజీ భార్య కిరణ్ రావు చూస్తుండటం విశేషం. వైవాహిక సంబంధ పరంగా విడిపోయినా వారిద్దరి కలిసి స్నేహపూర్వకంగా ఉంటూ షూటింగ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











