61 ఏళ్ల వయసులో అమీర్ ఖాన్ 3వ పెళ్లి.. వివాహం ఎప్పుడు? ఎక్కడంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మూడోసారి ముచ్చటగా పెళ్లి కాబోతున్నారు. గతంలో రెండు వివాహాలు బ్రేకప్ కావడంతో గత కొద్ది నెలలుగా ఆయన గౌరీ స్ప్రాట్ అనే ఫ్యాషన్, స్టైలిష్ట్‌తో సహజీవనం చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం పెళ్లి గురించి ప్రస్తావించగా తాము మానసికంగా ఇప్పటికే కలిసిపోయాం. మా పెళ్లి జరిగిపోయినట్టే అంటూ తనదైన శైలిలో మీడియాకు సమాధానం చెప్పారు. అయితే చిట్టచివరకు అమీర్ ఖాన్ మూడో పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. గౌరీతో ఆయన పెళ్లి ఎప్పుడు? గతంలో ఆయన చేసుకొన్న రెండు పెళ్లిళ్ల వివరాలు ఏమిటనే విషయంలోకి వెళితే..
బాలీవుడ్ సినీ ప్రముఖఉడు తాహీర్ హుస్సేన్ కుమారుడిగా అమీర్ ఖాన్ హిందీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కెరీర్ పరంగా నిలదొక్కుకొనే పరిస్థితుల్లో అప్పటి స్టార్ హీరోయిన్ రీనా దత్తాతో ప్రేమలో పడ్డారు. కొంతకాలం వారు డేటింగ్ చేసిన తర్వాత 1986 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. వారికి బాలీవుడ్ కుర్ర హీరో జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు సంతానం మొదటి వివాహం ద్వారా కలిగి ఉన్నారు. ఆ తర్వాత వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో 2002 సంవత్సరంలో అధికారికంగా విడిపోయారు. కానీ వారిద్దరూ ఇప్పటికీ స్నేహితులుగానే ఉండటం గమనార్హం.

రీనా దత్తాతో వివాహం తర్వాత లగాన్ షూటింగ్ సమయంలో తన అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావుతో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత 2005 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. వారికి ఆజాద్ అనే కుమారుడు పుట్టాడు. అయితే సవ్యంగా సాగుతున్న వారి కాపురం ఓ కుదుపుకు గురైంది. దాంతో అభిప్రాయ బేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో 2021 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు. ఇప్పటికీ కిరణ్ రావు, రీనాతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగించడం గమనార్హం.
కిరణ్ రావుతో విడాకుల తర్వాత ఆయన కొద్దికాలం ఒంటరిగా ఉన్నారు. అయితే 25 ఏళ్ల క్రితం పరిచయమై విడపోయిన గౌరీ స్ప్రాట్‌తో మళ్లీ స్నేహం చిగురించింది. ఆమె అమీర్ ఖాన్ ప్రొడక్షన్‌లో పనిచేయడం వల్ల వారి మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. అప్పటికే 7 కుమారుడు ఉన్న గౌరీ, అమీర్ ఖాన్ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే చివరకు వారిద్దరూ కలిసి ఏడడుగులు వేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్ స్వయంగా అధికారికంగా ప్రకటించారు.

అమీర్ ఖాన్ మూడో వివాహం జూలై 5వ తేదీన ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరుగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి వివాహం భారతీయ చట్టాల ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ జరుగనున్నది. ఈ పెళ్లికి సినీ పరిశ్రమలోని అత్యంత సన్నిహితులను అమీర్ ఆహ్వానించినట్టు సమాచారం. అలాగే కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరుకానున్నట్టు తెలిసింది.
61 ఏళ్ల అమీర్ ఖాన్‌ను గత కొద్దికాలంగా వరుస వైఫల్యాలు చుట్టుముట్టాయి. ఆయన నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. అయితే ఆయన నిర్మించిన లాపతా లేడీస్, సితారే జమీన్ పర్ చిత్రం భారీ విజయాలు అందుకొన్నాయి. ఆయన తమిళంలో రజనీకాంత్‌తో కలిసి కూలీ చిత్రంలో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం 3 ఇడియట్స్, బట్వారా 1947 చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications