పీకే మూవీలో రేడియో అడ్డుపెట్టుకొని నగ్నంగా.. సీక్రెట్స్‌ను బయటపెట్టిన అమీర్ ఖాన్!

భారతీయ సినిమా పరిశ్రమలో ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే అతి కొద్ది మంది నటుల్లో అమీర్ ఖాన్ ఒకరు. పాత్ర కోసం ప్రాణం ఇచ్చేందుకైనా సిద్దపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన నటించిన పీకే సినిమాలో నగ్నంగా నటించడానికి కూడా వెనుకాడలేదు. అలాంటి మిస్టర్ పర్‌ఫెక్ట్.. న్యూడ్ సీన్‌లో నటించడానికి పడిన కష్టాలను తాజాగా వెల్లడించారు. ఆ విషయాలను తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో కపిల్ శర్మ షో అమీర్ ఖాన్ ఆ సీన్ వెనుక ఉన్న సీక్రెట్‌ను రివీల్ చేస్తూ..

పీకే సినిమా చేసే సమయంలో రాజ్‌కుమార్ హిరాణీ నాకు కథ చెబుతూ.. అంతరిక్షం నుంచి ఓ గ్రహంతరవాసి భూమి మీదకు వస్తాడు. అతడి ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఉంటాడు. అతడి మెడలో మెరిసే ఓ నగ ఉంటుంది. ఓ వ్యక్తి రేడియో పట్టుకొని వెళ్తూ.. గ్రహంతర వాసిని చూసి.. అతడి మెడలో ఉన్న హారాన్ని లాగేసుకొని.. చేతిలో రేడియో పెట్టి పోతాడు అని సీన్ చెప్పాడు అని అమీర్ ఖాన్ తెలిపాడు.

Aamir Khan revealed struggles and Secret behind Nude Scene in PK Movie

పీకే మూవీలో నా ఇంట్రడక్షన్ సీన్ విన్న తర్వాత చాలా రోజులుగా ఆలోచించడం మొదలుపెట్టాను. నాకు డౌట్ వచ్చి న్యూడ్‌గా కనిపించే సీన్‌ను నిజంగానే అలానే చేస్తారా? అని అడిగాను. రాజ్ కుమార్ హిరాణీ కూడా అవును అన్నాడు. అప్పటి నుంచి రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ఎలా చేయాలి? ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు అనే ప్రశ్నలతో కంగారు పడ్డాను అని అన్నాడు.

అయితే రాజస్థాన్‌లోని ఓ మారుమూల ప్రాంతంలోని ఎడారిలో ఆ సీన్ చిత్రీకరించారు. ఆ ప్రాంతంలో మనుషులు ఎవరు లేకుండా డైరెక్టర్ చర్యలు తీసుకొన్నారు. కెమెరా డిపార్ట్‌మెంట్, క్యాస్టూమ్ వాళ్లు తప్పా మరోకరు ఎవరూ లేరు. అలా నిర్మానుష్యమైన ప్రాంతంలో షూట్ చేయడం మొదలుపెట్టాం అని చెప్పాడు.

Aamir Khan revealed struggles and Secret behind Nude Scene in PK Movie

స్పీడ్‌గా నడిస్తే.. చిన్నగా కవర్ చేసినది ఊడిపోతుందనే భయం మనసులో.. నాకు క్రికెట్ గాడ్‌తో కవర్ చేశారు. చిన్న చిన్న పీలకలకు ప్లాస్టర్ వేశారు. ముందు భాగం కొంత కవర్ చేశారు. వెనుక భాగం పూర్తిగా వదిలేశారు. అలానే నేను నడుస్తూ ఆ సీన్లను షూట్ చేశారు. ఇక ఫాస్ట్‌గా పరుగెత్తాల్సిన సీన్ షూట్ చేయాల్సి వస్తే చాలా కష్టమైంది. పరుగు పెడితే.. ఊడిపోతున్నది. అప్పుడు ఏం చేయాలో అర్ధం కాలేదు అని అమీర్ చెప్పాడు.

ఇక లాభం లేదని చెప్పి.. చూస్తూ నా నగ్నత్వాన్ని చూడనివ్వండి అని ధైర్యం చేశాను. కెమెరామెన్, డైరెక్టర్ తప్పా అందర్నీ అక్కడి నుంచి పంపించేశాను. షాట్ రెడీ అనగానే.. మొత్తం విప్పేసి పరుగెత్తడం మొదలుపెట్టాను. అలా సీన్ కంప్లీట్ అయింది. నా బాధ నాకుంటే.. రాజ్ కుమార్ హిరాణి.. సూపర్బ్ అంటూ కేకలు పెట్టాడు అని అమీర్ తన కష్టాలను వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X