3వ పెళ్లి చేసుకొన్న అమీర్ ఖాన్.. మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆస్తులు ఎన్నివేల కోట్లంటే?

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొన్నారు. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న బాలీవుడ్ డిజైనర్ గౌరీ స్ప్రాట్‌ను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకొన్నారు. గతంలో బాలీవుడ్ హీరోయిన్ రీనా దత్తా, డైరెక్టర్ కిరణ్ రావును వివాహం చేసుకొని విడాకులు ఇవ్వడం తెలిసిందే. అయితే 61 ఏళ్ల వయసులో హుషారుగా మూడో పెళ్లి చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అమీర్ ఖాన్ ప్రస్తుతం నికర ఆస్తుల విలువ ఎంత అనే చర్చ ఈ సందర్భంగా చర్చనీయాంశమైంది. ఆయన ఆస్తుల వివరాల్లోకి వెళితే..

అమీర్ ఖాన్ గత వైవాహిక జీవితం గురించిన వివరాల్లోకి వెళితే.. అలనాటి స్టార్ హీరోయిన్ రీనా దత్తాను 1986 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. వారికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు సంతానం కలిగారు. వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో 2002 సంవత్సరంలో అధికారికంగా విడిపోయారు. ఆ తర్వాత తన అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావును 2005 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. వారికి ఆజాద్ అనే కుమారుడు పుట్టాడు. అనంతరం 2021 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నారు.

Aamir Khan s net worth

గౌరీ స్ప్రాట్ విషయానికి వస్తే అమీర్ ఖాన్‌తో 25 ఏళ్ల క్రితం ఆమెకు పరిచయం ఉంది. కానీ మధ్యలో విడిపోయి ఇటీవల మళ్లీ కలుసుకొని డేటింగ్ చేశారు. కిరణ్ రావుతో విడాకుల తర్వాత కలిసి జీవించడం మొదలుపెట్టారు. జూలై 5వ తేదీన ఇద్దరు తమ మత సంప్రదాయల ప్రకారం ఒక్కటయ్యారు. ప్రస్తతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

అయితే భారతీయ సినిమా పరిశ్రమలో అమీర్ ఖాన్‌ ప్రస్తుతం అగ్రహీరోల్లో ఒకరుగా ఉన్నారు. ఆయన ఆస్తుల నికర విలువ సుమారుగా 1900 కోట్ల రూపాయలు. ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో కొన్ని ఇండ్లు, అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. హిల్ వ్యూ, బెల్లా విస్టాలో అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. మరీనా అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్స్ ఉన్నాయి. విర్గో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 12 ఫ్లాట్స్ ఉన్నాయి. విల్నోమోనా అపార్ట్‌మెంట్స్‌లో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి అని జాతీయ పత్రికలు వెల్లడించాయి.

అలాగే బాంద్రాలో సముద్ర తీర ప్రాంతంలో ఓ ఇంటిని కూడా కలిగి ఉన్నాడు. ఇటీవల 60 కోట్ల రూపాయలు వెచ్చించి ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో డూప్లెక్స్ ఇంటిని కొనుగోలు చేశాడు. అలాగే పంచగనిలో ఫామ్ హౌస్, ముంబై శివారులో రెండు ఎకరాల భూమిని కూడా కలిగి ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని షాబాద్, హర్దోయి ప్రాంతంలో తన కుటుంబ వారసత్వంతో సంబంధాలు పెట్టుకోవడానికి 22 ఇండ్లను కొనుగోలు చేసినట్టు అమీర్ ఖాన్ స్వయంగా తెలిపారు. బెవర్లీ హిల్స్‌లో 75 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం ఉంది.

ఇక ఆయనకు వాహనాలంటే మక్కువ అని స్నేహితులు చెబుతుంటారు. రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సెడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, టయోటా ఇన్నోవా, టయోటా విల్ఫైర్, మహింధ్రా ఎక్స్‌యూవీ 500 లాంటి కార్లు కూడా ఉన్నాయి. ఇంకా పలు వాహనాలు తన గ్యారేజ్‌లో ఉన్నాయి.

Read more about: aamir khan Gauri Spratt bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X