సీటిమార్ ఎఫెక్ట్.. ఏడేళ్ల తరువాత విడుదలవుతున్న మరో సినిమా

యాక్షన్ హీరో గోపీచంద్ ఒకప్పుడు ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లను అందుకునేవి. అయితే గతకొంత కాలంగా ఎదురవుతున్న అపజయాలు గోపీచంద్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడింది. ఇక మొత్తానికి అతను చాలా కాలం తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటీమార్ సినిమా మొదటిరోజు టాక్ తోనే క్లారిటీగా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఫిలింగా తెరకెక్కింది. మొత్తానికి ఈ సినిమా అనంతరం గోపీచంద్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని చూస్తున్నాడు. వీలైనంతవరకు మంచి కథను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. గోపీచంద్ సీటీమార్ సినిమా కంటే ముందు వరుసగా నాలుగు అపజయాలను చూశాడు.

సంపత్ నంది దర్శకత్వంలో ఇదివరకే గోపి గౌతమ్ నంద సినిమా చేశాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీసు వద్ద ఎందుకో అనుకున్నంత స్థాయిలో అయితే కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇక ఆ తర్వాత చేసిన పంతం చాణక్య సినిమాలు కూడా తీవ్ర స్థాయిలో నిరాశపరిచాయి. ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ తో ఫామ్ లోకి రావాలని ఎప్పటి నుంచో ఎదురచూస్తున్నాడు. మొదటి రోజే సీటిమార్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంది. ఇక రెండవ రోజు కూడా అదే దూకుడుగా వెళుతున్న గోపీచంద్ ఆదివారం కూడా భారీ స్థాయిలో లాభాలను అందుకునే అవకాశం ఉంది.

Aaradugula Bullet movie new release date announcement

అయితే గోపీచంద్ ఫామ్ లోకి రావడంతో మరో సినిమాను కూడా విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఏడేళ్ల క్రితం రావలసిన ఆరడుగుల బుల్లెట్ సినిమా గత కొంత కాలంగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. మధ్యలో ఫైనాన్షియల్ కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న సినిమా చివరికి ఓటీటీలో అయినా విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ సమస్యలు ఓ కొలిక్కి రాలేదు. ఇంకా ఫైనల్ గా గోపిచంద్ ఒక ట్రాక్ లోకి రావడంతో అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఇదివరకే ఇలాంటి పోస్టర్లను చాలా విడుదల చేసిన నిర్మాతలు సరైన పద్ధతిలో విడుదల చేయలేదు. కానీ ఈసారి మాత్రం అనుకున్న సమయానికి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడు గోపిచంద్ నమ్మకంతో ఉన్నాడు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించాడు ఎలాగైనా హిట్టు కొట్టి ఫామ్ లోకి రావాలి అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏ సినిమా కూడా అతనికి కలిసి రాలేదు. సిటీ మార్ సినిమాతో ఒక ట్రాక్ లోకి రావడంతో ఆరడుగుల బుల్లెట్ సినిమా ను కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. మరి ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X