ఎన్టీఆర్ ఇంట్లో వేరేలా ఉంటారు.. హలీమ్, బిర్యానీని కూడా: నమ్మలేని నిజాలు చెప్పిన నార్నే నితిన్
తెలుగు తెరపై ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దుమ్ములేపుతున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో అయితే ఎవరూ ఊహించని రీతిలో ఫామ్‌ను కనబరుస్తున్నాడు. తద్వారా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ హీరో నార్నే నితిన్.. ఎన్టీఆర్ గురించి నమ్మలేని ఎన్నో విషయాలను వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే....
ఏకంగా ఆరు హిట్లతో ఫామ్
దాదాపు ఐదారేళ్లుగా తనదైన చిత్రాలతో రచ్చ లేపుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన అతడు.. తర్వాత 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత వీరరాఘవ', 'RRR' వంటి హిట్లను అందుకున్నాడు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ మారిపోయాడు.

దేవరగా రాబోతున్న తారక్
బీభత్సమైన ఫామ్‌తో దూసుకెళ్తోన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బడా స్టార్‌గా మారిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ప్రస్తుతం అతడు 'దేవర' అనే సినిమాను చేస్తున్నాడు. రెండు పార్టులుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని విడుదల చేయబోతున్నారు.
పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లే
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే 'దేవర' మూవీ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ చేసుకున్నాడు. అదే సమయంలో బాలీవుడ్‌లో 'వార్ 2' అనే చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. వీటితో పాటు అతడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ పూజ ఇటీవలే కంప్లీట్ అయింది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ తారక్ నటించేందుకు సన్నద్దం అవుతున్నాడు.

పైకి కనిపించేలా ఉండరు
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి దేశం మొత్తం తెలుసు. కానీ, అతడు పర్సనల్‌గా కూడా ఎన్నో విభాగాల్లో బెస్ట్ అనిపించుకుంటున్నాడు. అలాంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు అతడి బావమరిది, యంగ్ హీరో నార్నే నితిన్ కొన్ని విషయాలు వెల్లడించాడు. ఎన్టీఆర్ పైకి కనిపించేలా ఉండడని స్పష్టం చేశాడు.
ఆయన పక్కనుంటే అంతే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నార్నే నితిన్.. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. 'మామూలుగా నేను ఖాళీగా ఉంటే బావగారి ఇంటికే వెళ్తాను. ఆయన పైకి గంభీరంగా కనిపించినా అలా ఉండరు. చాలా జోవియల్‌గా ఉంటారు. బావగారి పక్కన ఉన్న వాళ్లు ఎవరైనా చాలా సంతోషంగా నవ్వుతూనే ఉంటారు. అంతలా ఆయన అందరితో కలిసిపోతుంటారు' అని చెప్పాడు.

హలీమ్, బిర్యానీ చేస్తారు
నార్నే నితిన్ ఆ తర్వాత కంటిన్యూ చేస్తూ.. 'బావగారికి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆయన వంట కూడా బాగా చేస్తారు. ముఖ్యంగా హలీమ్, బిర్యానీ వంటివి బాగా వండుతారు. బావగారికి వండటం మాత్రమే కాదు.. అందరికీ మంచిగా భోజనాలు వడ్డించడం అంటే ఇష్టం. అందరూ కూర్చుని తింటుంటే ఆయన చాలా సంతోషిస్తారు' అని ఎన్టీఆర్ కుకింగ్ స్కిల్స్ గురించి వివరించాడు.


Click it and Unblock the Notifications











