అల్లు సిరీస్ 'ఎబిసిడి' ఫస్ట్ లుక్.. ఆకట్టుకుంటోన్న మోషన్ పోస్టర్!

మెగా హీరో అల్లు శిరీష్ ఈ సారి 'ఎబిసిడి' అంటూ రాబోతున్నాడు. ఎబిసిడి అనేది మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఎబిసిడి.. అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి రాజీవ్ రెడ్డి దర్శత్వం వహిస్తున్నారు. రుక్సార్ దిల్లోన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశాడు. అల్లు శిరీష్ లుక్ కూల్ గా ఉంటూ ఆకట్టుకుంటోంది. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో విజయం అందుకున్న శిరీష్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రంగినేని ఈ చిత్రానికి నిర్మాతలు. మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రంలో అల్లు శిరీష్ కు తండ్రిగా నటిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన మాస్టర్ భరత్ ఈ చిత్రంలో శిరీష్ కు స్నేహితుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

జుడా శాండీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు అల్లు శిరీష్ ప్రకటించాడు. శ్రీరస్తు శుభమస్తు చిత్రంలో నటనలో పరిణితి సాధించిన శిరీష్ ఈ చిత్రంలో ఎలా మెప్పించాడో వేచి చూడాలి.

ABCD - American Born Confused Desi Official First Look Motion Poster

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X