Sai Dharam Tej ఫోనే చేయలేదు.. ఆ మాటలతో జాబ్ మానేశా.. హీరోను కాపాడిన అబ్దుల్ ఆవేదన!
రేయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్ర లహరి, ప్రతి రోజూ పండగే వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఇటీవల న్యూ డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సినిమాతో మంచి విజయం సాధించాడు. అయితే ఈ సినిమాకు ముందు సాయి దరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

కాపాడిన వ్యక్తిని: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చిన చిత్రం 'విరూపాక్ష'. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే రిపబ్లిక్ మూవీ తర్వాత జరిగిన యాక్సిడెంట్ లో కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ సినిమా. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదంలో తనను కాపాడిన వ్యక్తి అబ్దుల్ ఫర్హాన్ గురించి, అతన్ని కలిసినట్లు ప్రమోషన్స్ లో మాట్లాడాడు.
అదంతా అబద్ధం: అబ్దుల్ ఫర్హాన్ ను స్వయంగా కలిసినట్లు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్లు సాయి ధరణ్ తేజ్ తెలిపాడు. డబ్బు ఇచ్చి అతని మానవత్వాన్ని వెలకట్టలేనని, కానీ ఎప్పుడూ అతనికీ ఏం అవసరం వచ్చినా అండగా ఉంటానని సాయి ధరమ్ తేజ్ హామీ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా అతన్ని కాపాడిన అబ్దుల్ (Abdul Farhan) మాత్రం అందులో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ అబద్ధాలని షాక్ ఇచ్చాడు.

చెర్రీ బైక్.. చిరు 5 లక్షలు: యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్ తనకు 2021లోనే ఎలాంటి సాయం అందలేదని తెలిపాడు. మెగా హీరోలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరూ తనతో మాట్లాడలేదన్నాడు. కానీ యూట్యూబ్ వీడియోల్లో చిరంజీవి రూ. 5 లక్షలు సాయం చేశారని, రామ్ చరణ్ తనకు బండి ఇచ్చారని వస్తున్న వార్తలన్నీ అవాస్తమని చెప్పుకొచ్చాడు.
ఫేక్ న్యూస్ వల్ల: ఇక తాజాగా విరూపాక్ష ప్రమోషన్స్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడిన వ్యాఖ్యలపై అబ్దుల్ ఫర్హాన్ రియాక్ట్ అయ్యాడు. "నేను కూడా ఆ వీడియో చూశాను. ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ కానీ, ఆయన టీమ్ కానీ ఎవరూ నన్ను కలవలేదు. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. అప్పుడు సీఎంఆర్ లో పనిచేసేవాడని. కానీ ఈ ఫేక్ న్యూస్ వల్ల అక్కడ టార్చర్ భరించలేకపోయా. చాలా మంది వచ్చి నీకు డబ్బులు ఇచ్చారంట కదా అని అడగడంతో జాబ్ మానేశా" అని అబ్దుల్ తెలిపాడు.

నష్టమే తప్పా లాభం లేదు: "జాబ్ మానేశాక నాలుగైదు నెలలు ఖాళీగా ఉన్నా. ఇప్పుడు అమెజాన్ లో డ్రైవింగ్ చేస్తున్నా. ఆరోజు నేను కేబుల్ బ్రిడ్జీ నుంచి వస్తున్నా. అప్పుడే యాక్సిడెంట్ జరిగాక హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తర్వాత పోలీసులు, మీడియా నుంచి అనేక కాల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే రిలేటివ్స్ తో పాటు చాలా మంది నాకు ఏం ఇచ్చారనే కాల్స్ ఎక్కువయ్యాయి. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల నాకు నష్టమే తప్ప లాభం ఏం జరగలేదు" అని అబ్దుల్ తన ఆవేదన చెప్పుకొచ్చాడు.
వెళ్లి కలుస్తా..: "సాయి ధరమ్ తేజ్ కాల్ చేస్తే వెళ్లి కలుస్తాను. కానీ దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం స్పెడ్ చేయకండి. సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా నేను చూశాను. చాలా బాగుంది. మెగా ఫ్యామిలీకి నేను కూడా పెద్ద అభిమాని. పిలిస్తే మాత్రం వెళ్లి కలుస్తా" అని అబ్దుల్ ఫర్హాన్ తన మనసులోని కోరికను బయట పెట్టాడు.


Click it and Unblock the Notifications











