నా కూతురుకి భయపడి అలాంటి సినిమాలు చేయడం లేదు.. అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వారసుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ ఒకప్పుడు స్టార్ హీరోగానే మంచి క్రేజ్ అందుకున్నాడు. కానీ ఎక్కువ కాలం బాలీవుడ్ బాక్సాఫీస్ ముందు తన మార్కెట్ ని నిలుపుకోలేకపోయాడు. వీలైనంత వరకు సపోర్టింగ్ రోల్స్ తో మెప్పిస్తూ జనాలు తనను మర్చిపోకుండా జాగ్రత్త పడుతున్నాడు.

రిజెక్ట్ చేయడానికి కారణం..

రిజెక్ట్ చేయడానికి కారణం..

ఇటీవల అభిషేక్ బచ్చన్ ఎవరు ఊహించని విధంగా కొన్ని కామెంట్స్ చేశారు. కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడానికి గల ముఖ్యకారణం తన కూతురని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అభిషేక్ నెక్స్ట్ బ్రీత్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో వదులుకున్న సినిమాల గురించి కూడా స్పందించాడు.

అలాంటి కథలు రిజెక్ట్ చేస్తాను..

అలాంటి కథలు రిజెక్ట్ చేస్తాను..

గతంలో చాలా సార్లు ఒక రకమైన సినిమాలను వదులుకున్నట్లు చెబుతూ.. ముఖ్యంగా రొమాంటిక్ సినిమాల్లో ఫిజికల్ గా దగ్గరయ్యే సీన్స్ ఉంటే ఆ కథలను రిజెక్ట్ చేస్తాను. చాలా సార్లు అలాంటి కథలను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నా కూతురు ఆరాధ్య జన్మించిన తరువాత నాలో ఒక బాధ్యతగల మార్పు వచ్చిందని వివరణ ఇచ్చారు.

ముందే చెప్పేస్తాను..

ముందే చెప్పేస్తాను..

'అడల్ట్ సీన్స్ , రొమాంటిక్ సీన్స్ డోస్ ఏ మాత్రం ఎక్కువైనా ఆ సినిమాల నుంచి తప్పుకుంటాను. సినిమా చేసే ముందే చిత్ర దర్శకుడికికి నిర్మాతకు నేను ఒక కండిషన్ గురించి చెప్తాను. ఫిజికల్ గా వల్గర్ గా ఉండే సన్నివేశాల్లో నటించలేను అని చెప్పిన తరువాతే సినిమా చేయడానికి సైన్ చేస్తాను' అని అభిషేక్ తెలిపాడు.

Recommended Video

Ilaiyaraaja : Unknown Facts About Ilaiyaraaja
ఎందుకంటే..

ఎందుకంటే..

ఎందుకంటే.. నేను చేసిన సినిమాలు చూసిన తరువాత నా కూతురు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది అని తను అడిగితే నాకు నచ్చదు. అందుకే వీలైనంత వరకు అలాంటి సినిమాలకు దూరంగా ఉంటాను అని బచ్చన్ తనయుడు వివరణ ఇచ్చాడు. అలాగే తన కూతురితోనే ఎక్కువ సమయం గడుపుతాను అంటూ.. ఆరాధ్య అంటే తన ప్రాణమని కూతురిపై ఉన్న ప్రేమ గురించి వివరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X