For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిజీత్ కొత్త సినిమాపై షాకింగ్ న్యూస్: తెలుగులో ఇప్పటి వరకూ రాని ప్రాజెక్టు.. అందుకే అలాంటి పని!

  |

  అప్పుడెప్పుడో హీరోగా పరిచయం అయినప్పటికీ.. అంతగా గుర్తింపును అందుకోలేకపోయాడు అభిజీత్. కానీ, ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడో.. అప్పటి నుంచి అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో భారీ స్థాయిలో క్రేజ్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ సీజన్‌ను కూడా గెలుచుకున్నాడు. ఈ షో ముగిసి చాలా కాలం అవుతోన్నా.. అతడి సినిమా ప్రకటన మాత్రం రాలేదు. ఇలాంటి సమయంలో అభిజీత్ కమ్‌బ్యాక్ మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా పరిచయం అయిన అభిజీత్

  అలా పరిచయం అయిన అభిజీత్

  ఎంతో మంది యంగ్ స్టార్లను తెలుగు తెరకు పరిచయం చేసిన శేఖర్ కమ్ములనే అభిజీత్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతోనే అతడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇది మాత్రం అంతగా ఆడలేదు. దీని తర్వాత అభిజీత్ ‘రామ్ లీలా', ‘మిర్చి లాంటి కుర్రాడు' కూడా అతడికి హిట్‌ ఇవ్వలేదు. కానీ ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ హిట్టైంది.

  బిగ్ బాస్ ఎంట్రీ.. భారీ ఫాలోయింగ్

  బిగ్ బాస్ ఎంట్రీ.. భారీ ఫాలోయింగ్

  హీరోగా పరిచయం అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన అభిజీత్.. బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలోనే ఆకట్టుకున్న అతడు.. భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తద్వారా సోషల్ మీడియాలో సైతం ట్రెండ్‌ను సెట్ చేశాడు. ఈ క్రమంలోనే అభిజీత్ పేరు దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యేలా చేశారు అభిమానులు.

  వాళ్లను గెలిచి.. విన్నర్ అయ్యాడు

  వాళ్లను గెలిచి.. విన్నర్ అయ్యాడు

  బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అభిజీత్ ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చాడు. కానీ, నిజాయితీతో ఆడుతూ.. కూల్‌గా ఉంటూ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. అదే సమయంలో టైటిల్ ఫేవరెట్లు అనుకున్న వాళ్లంతా బయటకు వెళ్లిపోవడం కూడా అతడికి కలిసొచ్చింది. దీంతో ఏకంగా 11 సార్లు ఎలిమినేషన్ తప్పించుకుని నాలుగో సీజన్‌కు విజేతగా నిలిచి సత్తా చాటాడు.

  అంతా మొదలు.. అభిజీత్ మాత్రం

  అంతా మొదలు.. అభిజీత్ మాత్రం

  బిగ్ బాస్ షో తర్వాత అభిజీత్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అతడు ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా ప్రకటించలేదు. అదే సమయంలో నాలుగో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు ఆరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్, దివి వాధ్యా, అవినాష్ తదితరులు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

  ఆ ఫొటోలతో మొదలు పెట్టేశాడుగా

  ఆ ఫొటోలతో మొదలు పెట్టేశాడుగా

  ఇటీవల అభిజీత్ గతంలో దిగిన సిక్స్ ప్యాక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు, ఒక్కో ఫొటో ఎప్పుడు ఎక్కడ దిగిందో వివరించాడు. అదే సమయంలో తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యను ప్రస్తావిస్తూ ఓ మెసేజ్ కూడా రాశాడు. అదే సమయంలో తాను వర్కౌట్‌ను మళ్లీ మొదలు పెడుతున్నానని, పాత రూపంలోకి వచ్చేందుకు శ్రమిస్తానని పేర్కొన్నాడు.

  అభిజీత్ కమ్‌బ్యాక్ మూవీ డీటేల్స్

  అభిజీత్ కమ్‌బ్యాక్ మూవీ డీటేల్స్

  అభిజీత్ సినిమా గురించి ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులంతా వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అతడు పలానా చిత్రంలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిజీత్ కమ్‌బ్యాక్ మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. అతడు త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన చేయబోతున్నాడట.

  Bigg Boss ని కోర్టుకు ఈడుస్తా.. వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు - CPI Narayana
  తెలుగులో తొలిసారి అలాంటి మూవీ

  తెలుగులో తొలిసారి అలాంటి మూవీ

  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అభిజీత్ ఓ అడ్వెంచర్ ఫిల్మ్‌తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడట. దీనిని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను హర్రర్ జోనర్‌లో రూపొందించబోతున్నారని అంటున్నారు. ఈ సినిమా కోసమే అభిజీత్ మరోసారి వర్కౌట్ మొదలు పెట్టాడని తెలిసింది. దీన్ని లాక్‌డౌన్ తర్వాత ప్రకటిస్తారని సమాచారం.

  English summary
  Bigg Boss Telugu 4 Winner Abijeet Duddala to Do Comeback Movie Very Soon. This Movie will be Ready with Adventure Elements.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X