For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బట్టలు విప్పేసి షాకిచ్చిన అభిజీత్: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్

  |

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లుగా ఎదిగారు. కానీ, కొందరు మాత్రం రెండు మూడు సినిమాలకే పరిమితం అయ్యారు. అలాంటి వారిలో లోకల్ బాయ్ అభిజీత్ ఒకడు. టాలెంట్ ఉన్నా సక్సెస్‌ను అందుకోలేకపోయిన అతడు.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అభిజీత్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేయడంతో పాటు ఎమోషనల్ నోట్ రాశాడు. ఆ వివరాలు మీకోసం!

  ఆ సినిమాతో పరిచయం.. అలా ఫేమస్

  ఆ సినిమాతో పరిచయం.. అలా ఫేమస్

  యంగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అభిజీత్. ఇది అతడికి నిరాశనే మిగిల్చింది. ఇక, ఈ మూవీ తర్వాత వచ్చిన ‘రామ్ లీలా', ‘మిర్చి లాంటి కుర్రాడు' కూడా అతడికి హిట్‌ను అందించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షిణితో కలిసి అభిజీత్ చేసిన ‘పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ మాత్రం హిట్ అయింది.

   బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. నిజాయితీతో క్రేజ్

  బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. నిజాయితీతో క్రేజ్

  హీరోగా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోవడంతో టాలీవుడ్‌కు దూరంగా ఉన్నాడు అభిజీత్. ఇలాంటి పరిస్థితుల్లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. షో ఆరంభంలోనే అద్భుతమైన ఆటతీరుతో పాటు నిజాయితీగా ఉంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. తద్వారా యూత్‌తో మాంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు.

  వాళ్లను గెలిచాడు.. విన్నర్‌గా నిలిచాడు

  వాళ్లను గెలిచాడు.. విన్నర్‌గా నిలిచాడు

  బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో నోయల్, లాస్య, గంగవ్వలను టైటిల్ ఫేవరెట్లు అనుకున్నారు. అయితే, వాళ్లంతా మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. అదే సమయంలో అభిజీత్ హీరోగా మారిపోయాడు. మిగిలిన కంటెస్టెంట్లు అందరూ అతడిని పదే పదే టార్గెట్ చేయడంతో ప్రేక్షకులు అండగా నిలిచారు. దీంతో 11 సార్లు ఎలిమినేషన్ తప్పించుకుని నాలుగో సీజన్‌కు విజేతగా నిలిచి సత్తా చాటాడు.

  ఊహించని విధంగా అభిజీత్ కెరీర్ గ్రాఫ్

  ఊహించని విధంగా అభిజీత్ కెరీర్ గ్రాఫ్

  బిగ్ బాస్ షో తర్వాత అభిజీత్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ, అతడు ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా ప్రకటించలేదు. అదే సమయంలో నాలుగో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు ఆరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్, దివి వాధ్యా, అవినాష్ తదితరులు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

  బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరో అభిజీత్

  బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరో అభిజీత్

  సినిమాలను ప్రకటించకపోయినా.. ఫ్యాన్స్‌ను నిరాశ పరచకుండా ఉండేందుకు అభిజీత్ ఎంతగానో శ్రమిస్తున్నాడు. ఇందుకోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా తన సిక్స్ ప్యాక్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అవి వైరల్ అవుతున్నాయి.

  అవన్నీ వివరిస్తూ ఎమోషనల్ మెసేజ్

  అవన్నీ వివరిస్తూ ఎమోషనల్ మెసేజ్

  అభిజీత్ సిక్స్‌ ప్యాక్‌తో ఉన్న దాదాపు పది ఫొటోలను షేర్ చేశాడు. అందులో ఒక్కో ఫొటో ఎప్పుడు ఎక్కడ దిగిందో వివరించాడు. అదే సమయంలో తన జీవితంలో ఎదుర్కొన్న ప్రధానమైన సమస్యను గురించి ప్రస్తావిస్తూ ఓ మెసేజ్ కూడా రాశాడు. అందులో తాను చాలా కాలంగా భుజం గాయంతో బాధ పడుతున్నట్లు వెల్లడించాడు. అదే తనను మరింత ధృడంగా చేసిందని చెప్పాడు.

  Bigg Boss ని కోర్టుకు ఈడుస్తా.. వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు - CPI Narayana
  మళ్లీ మొదలు పెడుతున్నానని చెబుతూ

  మళ్లీ మొదలు పెడుతున్నానని చెబుతూ

  గతంలో ప్రతిరోజూ వర్కౌట్ చేయడం వల్ల సిక్స్ ప్యాక్ సాధించానని చెప్పిన అభిజీత్.. భుజం గాయం కారణంగా ఫిట్‌నెస్ కోల్పోయానని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తాజాగా పెట్టిన పోస్టు ద్వారా తాను వర్కౌట్‌ను మళ్లీ మొదలు పెడుతున్నట్లు తెలిపాడు. పాత రూపంలోకి వచ్చేందుకు శ్రమిస్తానని పేర్కొన్నాడు. దీంతో యంగ్ హీరో అభిజీత్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

  English summary
  Bigg Boss Telugu 4 Winner Abijeet Duddala was Shared His Throwback Six Pack Photos In Instagram. These Pictures Gone be Viral In Social Media. In This Post Bigg Boss Telugu Winner Written an Emotional Note on his Life Stuggles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X