ఆ మైలురాయిని చేరుకున్న ‘ఆచార్య’: చిరంజీవి గ్రేస్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం 'ఆచార్య'. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండడంతో ఇది మెగా మల్టీస్టారర్ అయిపోయింది. దేవాదాయ భూముల ఆక్రమణలపై నక్సలిజం అనే పాయింట్‌ను జత చేసి దీన్ని సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. దీంతో మరో 14 రోజులు బ్యాలెన్స్ ఉండిపోయింది. ఫలితంగా ప్రకటించిన సమయానికిఈ సినిమా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇది అరుదైన ఘనతను అందుకుంది.

హాట్ క్లీవేజ్ షో కాక రేపుతోన్న రాజశేఖర్ కూతురు శివాత్మిక

'ఆచార్య' మూవీ నుంచి కొద్ది రోజుల క్రితం 'లాహే లాహే' అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్ విడుదలైంది. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. హారిక నారాయణన్, సాహితీ చాంగంటి ఆలపించారు. ఇందులో సీనియర్ హీరోయిన్ సంగీతం క్లాసికల్ డ్యాన్స్, చిరంజీవి గ్రేస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరంభంలోనే ఆకట్టుకున్న ఈ పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఇది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మెలోడీ సాంగ్ యాభై మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుంది.

 Acharya LaaheLaahe Lyrical Song Reach 50M Views

మొదటి సాంగ్‌కు మంచి ఆదరణ లభించడంతో త్వరలోనే 'ఆచార్య' మూవీ నుంచి నీలాంబరి అని సాగే పాటను రిలీజ్ చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఇందులో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఇందులో హీరోయిన్లుగా చేస్తోన్నారు. ఈ సినిమాకు మెలోడీ కింగ్ మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X