Acharya: మెగాస్టార్ సరికొత్త ప్లాన్.. జూలై నుంచి జెట్ స్పీడ్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఒకసారి సినిమాకు ఓకే చెబితే వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటారు. చెప్పిన టైమ్ కంటే అరగంట ముందే షూటింగ్ స్పాట్ లో ఉండి దర్శకుడు ఫ్యాకప్ చెప్పే వరకు కూడా అక్కడి నుంచి కదలరని చాలా మంది సినీ ప్రముఖులు చెబుతుంటారు. ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ ఏ మాత్రం అలసిపోకుండా వర్క్ చేస్తున్నారు.

లాక్ డౌన్ ముందు వరకు కూడా ఆచార్య షూటింగ్ లో బిజీగా కనిపించిన చిరంజీవి సెకండ్ వేవ్ ఎక్కువవ్వడంతో ప్రాజెక్టును ఆపేసిన విషయం తెలిసిందే. మరో రెండు వారాలు గ్యాప్ లేకుండా వర్క్ చేస్తే మొత్తం పనులన్ని అయిపోయి ఉండేవి. కానీ లాక్ డౌన్ కారణంగా నిలిపివేయక తప్పలేదు. ఇక ఇప్పట్లో స్టార్ట్ చేసే ఛాన్స్ కూడా కనిపించడం లేదు. అందుకే మరొక నెల రోజుల పాటు గ్యాప్ తీసుకొని జూలై నెలలో బిజీ కానున్నారట.

Acharya movie shooting megastar jet speed plan

జెట్ స్పీడ్ లో షూటింగ్ ను పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ విషయంలో దర్శకుడు మెగాస్టార్ తో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాడట. అయితే కోవిడ్ తీవ్రత తగ్గే వరకు రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని డిసైడ్ అయ్యారట. ఇక దసరా అనంతరమే సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X