Acharya: ఈవెంట్‌లో టెన్షన్ టెన్షన్.. చరణ్ మీదకు దూసుకొచ్చిన కుర్రాడు.. వాళ్లే పంపించారా అంటూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం గతంలో కంటే ఇప్పుడు ప్రేక్షకుల ధోరణి పూర్తిగా మారిపోవడమే. అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువగా అలాంటి సినిమాలతో క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే హీరోలు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో మల్టీస్టారర్ మూవీలు వచ్చాయి. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'ఆచార్య'. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ఓ కుర్రాడు చరణ్ మీదకు దూసుకొచ్చాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

 తండ్రీ కొడుకు కలయికలో రెడీగా

తండ్రీ కొడుకు కలయికలో రెడీగా

మెగా హీరోలు చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రమే 'ఆచార్య'. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మించాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

 సిద్ధ కోసమే ధర్మస్థలిలోకి ఆచార్య

సిద్ధ కోసమే ధర్మస్థలిలోకి ఆచార్య


సాధారణంగా కొరటాల శివ తెరకెక్కించే సినిమాలు సందేశాత్మకంగా తెరకెక్కుతుంటాయి. ఇప్పుడు 'ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ తీశారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. ఓ మిషన్‌లో సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని పూర్తి చేస్తాడట.

 గ్రాండ్‌గా మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్

గ్రాండ్‌గా మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్


'ఆచార్య' మూవీని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. దీంతో ఆచార్య సందడి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు.

 ఎన్నో హైలైట్లతో సాగిన ఈవెంట్

ఎన్నో హైలైట్లతో సాగిన ఈవెంట్


'ఆచార్య' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా జరిగింది. దీనికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో పాటలు, డ్యాన్సులు, స్పెషల్ ఏవీలు చూపించారు. అలాగే, చిరంజీవి, చరణ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇక, దీనికి సురేఖ, ఉపాసన, సుస్మితా కూడా వచ్చి సందడి చేశారు.

 చరణ్ మీదకు దూసుకొచ్చేశాడు

చరణ్ మీదకు దూసుకొచ్చేశాడు

ఎంతో వైభవంగా జరిగిన 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతుండగా ఓ కుర్రాడు స్టేజ్ మీదకు దూసుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ ఘటనతో స్టేజ్‌ మీద ఉన్న సెలెబ్రిటీలతో పాటు గ్రౌండ్‌లో ఉన్న మెగా అభిమానులు మొత్తం షాక్‌కు గురయ్యారు.

వాళ్లే నిన్ను పంపించారా అంటూ

వాళ్లే నిన్ను పంపించారా అంటూ


సదరు కుర్రాడు ఆచార్య అనే లోగో ఉన్న షర్ట్ ధరించి కనిపించాడు. అతడు పైకి వచ్చిన వెంటనే బౌన్సర్లు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్లను అడ్డుకున్న చరణ్ 'నిన్ను ఎవరు సెట్ చేశారు? పైకి వెళ్లమని చెప్పారా' అని అందరి ముందే ప్రశ్నించాడు. దీనికి ఆ అభిమాని అవును అన్నట్లుగా తల ఊపాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెల్ఫీ దిగిన చరణ్.. కామెంట్‌తో

సెల్ఫీ దిగిన చరణ్.. కామెంట్‌తో


ఇక, ఆ అభిమానితో రామ్ చరణ్ సెల్ఫీ దిగాడు. దీంతో అతడు ఎంతో ఆనందంతో కిందకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ స్పీచ్ కంటిన్యూ చేశాడు. అదే సమయంలో 'ఎవరు సెట్ చేశారు' అని చరణ్ అడిగిన ప్రశ్న ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఫంక్షన్లలో ఇలా కావాలనే ప్లాన్ చేస్తున్నారా అని అంతా అనుకుంటున్నారు. ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X