బాలయ్య రిజెక్ట్ సినిమాలో మరో యాక్షన్ హీరో.. హ్యాట్రిక్ కోసం టార్గెట్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల షూటింగ్ విషయంలో స్పీడ్ పెంచారు. ఇక వినాయకచవితి సందర్భంగా సినిమాను భారీగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులు అనుకూలించకపోతే సినిమా వాయిదా పడే అవకాశం లేకపోలేదు.
ఇక ఇటీవల బాలకృష్ణ కోసం చాలా మంది దర్శకులు ప్రయత్నం చేశారు. గోపిచంద్ మలినేని - మైత్రి మేకర్స్ లో ఓకేచేయగా ఆ సినిమాను అఖండ అనంతరం స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే లైన్ లో మరికొందరు దర్శకులు కూడా ఉన్నారు. అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ వంటి వారు కూడా బాలయ్యతో సినిమా చేయాలని అనుకుంటున్నారు. అయితే బాలయ్య మాత్రం తనకు కథ నచ్చితే గాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

బాలకృష్ణతో డిక్టేటర్ సినిమా చేసిన దర్శకుడు శ్రీవాస్ కూడా ఒక సినిమా చేయాలని ఇటీవల ప్రయత్నాలు గట్టిగానే చేశాడు గాని వర్కౌట్ కాలేదు. ఇక ఆ సినిమా కథను శ్రీవాస్ గోపిచంద్ కు షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల అఫీషియల్ గా గోపీచంద్ - శ్రీవాస్ సినిమాపై ఎనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదివరకే వీరి కాంబినేషన్ లో లక్ష్యం - లౌక్యం వంటి బాక్సాఫీస్ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బాలకృష్ణతో కుదరకపోవడం వల్ల అదే కథను గోపికి చెప్పగా వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక మరోవైపు గోపిచంద్ సీటిమార్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











