twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడికి ఛాన్స్‌లు ఇవ్వొద్దన్న వారికి రివర్స్‌లో ఇచ్చా, ఆస్తులు అమ్మేశా: అర్జున్

    |

    Recommended Video

    Kurukshetram Movie Team Interview

    సౌత్‌లో టాప్ యాక్షన్ స్టార్స్ లిస్టు తయారు చేస్తే అందులో తప్పకుండా... సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సారా పేరు ఉంటుంది. త్వరలో అతడు 'కురుక్షేత్రం' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అరుణ్‌ వైద్యనాధన్‌ దర్శకుడు. ఫ్యాషన్‌ స్టూడియోస్‌ సమర్పణలో తెరకెక్కిన ఈక్రైమ్‌ థ్రిల్లర్‌ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస్‌ మీసాల తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయిన ఆయన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాయి.

    అర్జున్ 150వ సినిమా

    అర్జున్ 150వ సినిమా

    కురుక్షేత్రం అర్జున్ కెరీర్లో 150వ చిత్రం. ఇందులో విభిన్నమైన పోలీసు ఆఫీసర్ పాత్రలో, రియాలిటీకి దగ్గరగా ఉండే రోల్ పోషించారు. యాక్షన్‌, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు.

    పోలీస్ కావాలనుకుని... అనుకోకుండా నటన వైపు

    పోలీస్ కావాలనుకుని... అనుకోకుండా నటన వైపు

    సినిమాల్లోకి రాక ముందు నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉండేది. నటన వైపు రావాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. పుష్ చేయడం వలన సినిమాల్లోకి వచ్చాను అని అర్జున్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

    తెలుగులో మొదటి మూవీ

    తెలుగులో మొదటి మూవీ

    తెలుగులో 'మా పల్లెలో గోపాలుడు' సినిమా ద్వారా కెరీర్ ప్రారంభించారు. కోడి రామకృష్ణగారు ఎలా చేయమంటే అలా చేశాను .. అంతకు మించి నాకు ఏమీ తెలిసేది కాదు. అపుడు నాకు నటనతో పాటు భాష కూడా సరిగా రాక పోవడం వల్ల కోడి రామకృష్ణగారు నా వల్ల చాలా కష్టపడ్డారు అని అర్జున్ గుర్తు చేసుకున్నారు.

    చెడ్డ వాళ్లకు ముందు నుండీ దూరం

    చెడ్డ వాళ్లకు ముందు నుండీ దూరం

    సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏమైనా రాజకీయాలు ఫేస్ చేశారా? అనే ప్రశ్నకు అర్జున్ స్పందిస్తూ... మంచి, చెడు అనేది ఎప్పుడూ ఉంటుంది. చెడును పట్టించుకుంటూ కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. తెలిసో .. తెలియకో ముందు నుండీ నేను వారిని దూరం పెడుతూ వచ్చాను అని తెలిపారు.

    నాకు ఛాన్స్ ఇవ్వొద్దవారికి రివర్స్‌లో ఇచ్చాను

    నాకు ఛాన్స్ ఇవ్వొద్దవారికి రివర్స్‌లో ఇచ్చాను

    నేను కర్ణాటక ప్రాంతానికి చెందినవాణ్ణి కావడంతో వీడికి ఎందుకు ఛాన్సులు ఇస్తున్నారని కొంతమంది నా ముందే అనేవారు. అపుడు చాలా బాధేసేది. తర్వాత నేను హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎదిగిన తర్వాత నా గురించి గురించి అపుడు అలా అన్నవారికి పిలిచి పని ఇచ్చాను. అది నేను వారిపై సాధించిన విజయంగా భావిస్తాను అని అర్జున్ అన్నారు.

    ఆస్తులు అమ్మాను, ఆ సినిమా నాకు ప్రత్యేకం

    ఆస్తులు అమ్మాను, ఆ సినిమా నాకు ప్రత్యేకం

    నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో 'సేవగన్' చాలా ప్రత్యేకం. నాకు మార్కెట్ లేనప్పుడు నేనే దర్శక నిర్మాతగా మారి 'సేవగన్' చేశాను. ఈ సినిమా కోసం నా ఆస్తులు అమ్మేశాను. ఆ మూవీ నాకు లైఫ్ ఇచ్చింది. తెలుగులో 'పోలీస్ రౌడీ'గా విడుదలై మంచి విజయం అందుకుంది అని అర్జున్ గుర్తు చేసుకున్నారు.

    English summary
    Action King Arjun about his upcoming film Kurukshetram.The movie directed by Arun Vaidhyanathan. The movie also features Prasanna, Varalakshmi Sharathkumar, Shruthi Hariharan, Vaibhav and others who played meaty roles in the film. The film will reveal the dark secrets of a psycho-killer. S Naveen has composed the music and the Cinematography has been handled by Arvind Krishna. Dialogues are penned by Sashank Vennelakanti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X