Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దటీజ్ అమీర్ ఖాన్... ఆ దెబ్బకు అతి సామాన్యుడిలా మిస్టర్ ఫర్ఫెక్ట్.. వైరల్‌గా వీడియో
మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన సాధారణ వ్యక్తిత్వాన్ని మరోసారి చాటిచెప్పాడు. సాధారణంగా సినీ తారలు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తుండటం చూస్తుంటాం. కానీ అమీర్ ఖాన్ తాజాగా ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాధారణ వ్యక్తిలా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి తోటి ప్రయాణికులకు ఝలక్ ఇచ్చారు. ప్రస్తుతం అమీర్ ప్రయాణానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు అమీర్ ఖాన్ ఎందుకు ఎకానమి క్లాస్‌లో ప్రయాణించాల్సి వచ్చిదంటే...
సాదాసీదా ప్రయాణికుడిలా అమీర్
భారతీయ వైమానిక రంగాన్ని జెట్ ఎయిర్వేస్ సంక్షోభం వెంటాడుతున్నది. జెట్ ఎయిర్ వేస్ విమానాల రద్దు కారణంగా ప్రయాణికుల డిమాండ్ పెరగడంతో సీట్ల కొరత ఏర్పడింది. దాంతో విధిలేక ప్రముఖులు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సిన గత్యంతరం ఏర్పడింది. దాంతో సాదాసీదా ప్రయాణికుడిలా అమీర్ ప్రయాణించడం జరిగింది.
|
తోటి ప్రయాణికులకు ఝలక్
అమీర్ ఖాన్ ప్రయాణం తప్పనిసరి కావడంతో చివరి నిమిషంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాల్సి వచ్చిందంట. విమానంలోకి అమీర్ ఎక్కగానే తోటి ప్రయాణికులు అవాక్కయ్యారట. అమీర్ కనిపించగానే విమానంలో హంగామా మొదలైందట. సెల్ఫీలతో తోటి ప్రయాణికులు హడలెత్తించారట. అమీర్ ట్రావెల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నది.
ఫారెస్ట్ గంప్ రీమేక్‌లో మిస్టర్ ఫర్ఫెక్ట్
ఇక కెరీర్ విషయానికి వస్తే.. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్లాపడిన తర్వాత అమీర్ ఖాన్ ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ రీమేక్ లాల్ సింగ్ చద్దాతో రెడీ అవుతున్నారు. మార్చిలో తన జన్మదినం సందర్భంగా లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే.
లాల్ సింగ్ చద్దాగా అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఫారెస్ట్ గంప్ చిత్రాన్ని హిందీలో లాల్ సింగ్ చద్దాగా తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రాన్ని వాయకామ్ 18 మోషన్ పిక్సర్స్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నది. హాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ పారామౌంట్ నుంచి హక్కులు కొనుగోలు చేశాం. నేను లాల్ సింగ్‌గా కనిపిస్తాను అని తెలిపారు.